ముద్ర శ్రీరంగాపూర్:
శ్రీరంగాపూర్ మండల పరిధిలోని మంగళవారం ఏడిఏ ప్రభాకర్ రెడ్డి పలు ఎరువుల దుకాణాలలో తనిఖీలు చేశారు. అనంతరం ఎరువుల డీలర్ల రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఎరువులను అధిక రేట్లకు అమ్మితే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. అలాగే నకిలీ విత్తనాలు అమ్మ రాదని, ఫర్టిలైజర్ ఆన్లైన్ యాప్ వచ్చిన తర్వాత నేరుగా రైతులకే ఏ షాపులలో ఎంత యూరియా ఉందని తెలుస్తుందని వారు అన్నారు. ఈ యాప్ ద్వారా రైతులు సులభంగా యూరియాను బుక్ చేసుకోవచ్చునీ అన్నారు. రైతులు అడిగితే తప్ప గొలికలు తీసుకోవాలని డిమాండ్ చేయవద్దని డీలర్లను హెచ్చరించారు. యూరియా మండలానికి సరిపడా ఉందని రైతులు ఎవ్వరుఆందోళన చెందవలసిన అవసరం లేదని సూచించారు.