- జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష.
ముద్ర ప్రతినిధి, గోదావరిఖని: మల్కాపూర్ లోని ఫీకల్ స్లెడ్జ్ ట్రీట్మెంట్ ప్లాంట్ (ఎఫ్ఎస్ టి పి)కు తాము సేకరించిన వ్యర్ధాలను తరలించిన సెప్టిక్ ట్యాంక్ క్లీనర్ వాహనాలకు ఒక ట్రిప్ కు రూ 200/-నగదు ప్రోత్సాహకo అందించనున్నట్లు జిల్లా కలెక్టర్, రామగుండం నగర పాలక సంస్థ ప్రత్యేకాధికారి కోయ శ్రీ హర్ష, అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) ,కమిషనర్ (ఎఫ్ ఎ సి) జె.అరుణ శ్రీ ఒక ప్రకటనలో తెలిపారు.ప్లాంట్ కు తరలించ కుండా బయట ఎక్కడ పడవేసినా సదరు సెప్టిక్ ట్యాంక్ క్లీనర్ వాహన నిర్వహకులపై చర్యలు తీసుకోవడం జరుగుతుoదని తెలిపారు.కావున మలవ్యర్ధాలను రీ సైకిలింగ్ చేయడానికై ఏర్పాటు చేసిన ఈ ప్లాంట్ పూర్తి స్థాయిలో పని చేయడానికి సెప్టిక్ ట్యాంక్ క్లీనర్ వాహన నిర్వాహకులు సహకరించాలని కోరారు.