Take a fresh look at your lifestyle.

ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ మృతికి ప్రభుత్వానిదే బాధ్యత

 

ముద్ర, జోగుళాంబ గద్వాల‌ జిల్లా ప్రతినిధి:

హక్కుల సాధన కోసం సంఘటితంగా పోరాడాలి తప్ప, ఇలాంటి ఆత్మబలిదానాలకు ఎవరూ ఒడిగట్టవద్దని వారు హృదయపూర్వకంగా మనవి చేశారు.మేనిఫెస్టోలో ఇచ్చిన వాగ్దానాలు సైతం అమలు చేయకుండా ఇంకెన్నాళ్లు కాలం గడుపుతావు సీఎం రేవంత్ రెడ్డి? ఇలా ఎంతమందిని బలి తీసుకుంటావు అని బీఅర్ఎస్ బీజేపీ, సీపీఐ, ప్రజసంఘాల నాయకులు మండిపడ్డారు. ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ మృతి పట్ల శుక్రవారం ప్రతిపక్షాల నాయకులు గద్వాల ఆర్టీసీ డిపో ముందు ఆయన చిత్రపటానికి పూల మాల వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా శంకర్ గౌడ్ ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు ఈ కష్ట సమయంలో దేవుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని వారు ప్రార్థించారు. ​ఆర్టీసీ కార్మికులు ఎవరూ ఆందోళన చెందవద్దని, క్షణికావేశంలో బలవన్మరణాల వంటి నిర్ణయాలు తీసుకోవద్దని విన్నపించారు. మృతి చెందిన శంకర్ గౌడ్ కుటుంబానికి రూ.కోటి ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని, శంకర్ గౌడ్ కుటుంబంలో ఒకరికి శాశ్వత ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం గద్వాల ఆర్టీసీ బస్టాండ్ ముందు రోడ్డు పై బైఠాయించి ఆందోళన కార్యక్రమం చేపట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వ అలసత్వం, నిర్లక్ష్యం వల్ల ఇలాంటి పరిస్థితి వచ్చిందని వారు ఆరోపించారు. అధికారంలోకి రాగానే ఆర్టీసీ విలీన ప్రక్రియను పూర్తి చేస్తామని, ఇతర అన్ని సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి మాట తప్పడంవల్లనే ఈ దుస్థితి వచ్చిందని మండిపడ్డారు.

మేనిఫెస్టోలో ఇచ్చిన వాగ్దానాలు సైతం అమలు చేయకుండా ఇంకెన్నాళ్లు కాలం గడుపుతావు సీఎం రేవంత్ రెడ్డి? ఇలా ఎంతమందిని బలి తీసుకుంటావు అని వారు మండిపడ్డారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చి దాదాపు రెండున్నరేండ్లు అవుతున్నది.. అప్పటి నుంచి తమ సమస్యలు పరిషరించాలని ఆర్టీసీ కార్మికులు వేడుకుంటున్నా.. ఇప్పటికీ అతిగతి లేదన్నారు. దీంతోనే కార్మికులు సమ్మెకు దిగాల్సివచ్చింది’ అని అన్నారు..మంత్రి పొన్నం ప్రభాకర్‌ అధికార దాహంతో కార్మికుల సమస్యలను పక్కన పెట్టి ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం సరికాదని పేర్కొన్నారు. కార్మికుల ప్రాణాలతో ప్రభుత్వం చెలగాటం ఆడటం ఆపాలని సూచించారు. ఆర్టీసీ కార్మిక సోదరులారా, మీరు చేస్తున్న పోరాటానికి మేమంతా అండగా ఉన్నాం. అధైర్యానికి లోనుకాకండని భరోసానిచ్చారు. కలిసికట్టుగా, న్యాయబద్ధంగా పోరాడి మన హక్కులను సాధించుకుందామని పిలుపునిచ్చారు. ఎలాంటి తొందరపాటు చర్యలకు పాల్పడవద్దని మరోసారి మనవి చేశారు. ఇప్పటికైనా చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించి,

మరిన్ని ప్రాణాలు పోకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బీఅర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి బాసుహన్మంతు నాయుడు, నాయకులు నాగర్ దొడ్డి వెంకట్రాములు, వెంకటేశ్వర రెడ్డి,అల్లపాడు ప్రతాప్,పటేల్ జనార్దన్ రెడ్డి,కోటేష్,మోనేష్,కౌన్సిలర్లు పులిపాటి వెంకటేష్,గువ్వల గోపాల్,చిత్తరి కిరణ్,మోహన్ యాదవ్,కమ్మరి రాము,గంజిపేట రాజు,కురవ పల్లయ్య,జాంపల్లి భరత్ సింహారెడ్డి, బీజేపీ జిల్లా‌ అధ్యక్షుడు‌ రామాంజనేయులు, కౌన్సిలర్లు, నాయకులు, సీపీఐ నాయకులు అంజనేయులు, ప్రజా సంఘాల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.