Take a fresh look at your lifestyle.

ఖానాపూర్ మున్సిపల్ చైర్మెన్ ఎంపికకు మార్గం సుగమం

 

ముద్ర ప్రతినిధి, నిర్మల్:
నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపాలిటీ లో మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎంపిక లో ప్రతిష్టంభన తొలగిపోయింది. బి ఆర్ ఎస్, బీజేపీ, కాంగ్రెస్ లు చేరి నాలుగు స్థానాలు గెలుచు కోవటం వల్ల ఈ సమస్య తలెత్తింది. బీఆర్ఎస్,బీజేపీ కలిసి ఈ సమస్యకు ముగింపు పలికారు. మున్సిపాలిటీ పీఠం కోసం ఇద్దరం కలిసి పని చేస్తామని ప్రకటించారు. రెండు పార్టీలు బుధవారం వేర్వేరుగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ వివరాలు వెల్లడించారు. చైర్మన్ పదవిని బీజేపీకి ఇచ్చి వైస్ చైర్మన్, నాలుగు కో ఆప్షన్ పదవులు ఇవ్వాలని నిర్ణయించినట్లు ప్రకటించారు. లేని పక్షంలో చైర్మన్ పదవిని బీఆర్ఎస్, వైస్ చైర్మన్ తో పాటు నాలుగు కో ఆప్షన్ పదవులు బీజేపీ కి ఇవ్వాలని కోరారు. పట్టణం అభివృద్ధికి జేఏసీ నేతృత్వంలో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీ లు పని చేద్దాం అని పిలుపునిచ్చారు. మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ ను తిరస్కరించారని, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వ సహకారంతో ఇంటిగ్రేటెడ్ స్కూల్, మున్సిపల్ లలో ఉపాధి హామీ పథకం తిరిగి ప్రారంభం చేయిస్తామని అన్నారు. పట్టణ ప్రజల ఆకాంక్ష మేరకు కలిసి అభివృద్ధికి కృషి చేద్దామని అన్నారు.

.

Leave A Reply

Your email address will not be published.