Take a fresh look at your lifestyle.

మహిళా ఉద్యోగులకు క్రీడల పోటీలు

ముద్ర ప్రతినిధి, భువనగిరి :

మార్చ్ 8 మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లాలోని మహిళా ఉద్యోగులకు క్రీడల పోటీలు నిర్వహించనున్నట్లు జిల్లా యువజన, క్రీడల అధికారి కె. ధనంజనేయులు, తెలంగాణ రాష్ట్ర గజేటెడ్ అధికారుల అసోసియేటెడ్ ప్రెసిడెంట్ మందడి ఉపేందర్ రెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లా యువజన, క్రీడల కార్యాలయంలో ఏర్పాటుచేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ 18 రకాల ఫన్నీ గేమ్స్ ప్రణాళికను వివిధ జిల్లా మహిళా అధికారుల సమక్షంలో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ పోటీలు మార్చి 5, 6, 7 తేదీల్లో జరుగుతాయన్నారు. 40 ఏళ్లు పైబడిన వారికి టెన్నికోట్, మ్యూజికల్ చైర్, చెస్, కార్రోమ్స్, స్పీడ్ వాక్, స్కిప్పింగ్ రేస్, లెమన్ అండ్ స్పూన్, షటిల్ బాడ్మింటన్,
40 ఏళ్లలోపు వారికి టెన్నికోట్, మ్యూజికల్ చైర్, చెస్, కార్రోమ్స్, స్పీడ్ వాక్ , నిద్దలే అండ్ త్రిడ్, స్కిప్పింగ్ రేస్, లెమన్ అండ్ స్పూన్, షటిల్ బాడ్మింటన్ నిర్వహించనున్నట్లు తెలిపారు. జిల్లా మహిళ ఉద్యోగులు అధిక సంఖ్యలో పెర్లని నమోదు చేసుకొని ఉద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్ ఎస్ జీఫ్ సెక్రెటరీ దశరథ్ రెడ్డి, పిడి రఘువీర్ సింగ్, సంగీత, శైలజ, శ్రీకాంత్, శేఖర్, యువజన సంఘాల నాయకుడు కరుణ్, కార్యాలయ సిబ్బంది మురళి, రేఖ, శ్రీనివాస్ పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.