ఉపాధ్యాయుల పని తీరును ప్రశంసించిన జిల్లా ప్యానల్ ఇన్స్పెక్షన్ టీం
విద్యార్థుల ప్రతిభకు బృందం అభినందనలు
ముద్ర ప్రతినిధి, సిద్దిపేట :
మండల పరిధి లోని రామంచ ప్రాథమిక పాఠశాలను జిల్లా స్థాయి ప్యానల్ తనిఖీ బృందం కోళ్ల పద్మారెడ్డి, నాగేందర్,
నీరడి లక్ష్మీ నారాయణలు శనివారం సందర్శించారు..
ఈ సందర్బంగా పాఠశాలలో జరుగుతున్న విద్యా కార్యక్రమాలను సమగ్రంగా పరిశీలించారు. ఉపాధ్యాయుల మోడల్ లెసన్స్, విద్యార్థుల అభ్యసన స్థాయిని పరిశీలించారు.
పాఠశాల రికార్డులు, హాజరు నమోదు, విద్యా ప్రణాళిక, డిజిటల్ తరగతి బోధన, ఏఐ, ఏఎక్స్ఎల్ , పాఠశాల ఇండెక్స్, మధ్యాహ్న భోజనం, స్కూల్ క్యాలెండర్ ను పరిశీలించారు. ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు, స్కావెంజర్, మధ్యాహ్న భోజన సిబ్బంది డ్రెస్ కోడ్ పాటించడంను అభినందించారు. పాఠశాల పరిసరాలు, బడి తోట ను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేసారు. ఉపాధ్యాయ బృందంను ప్రత్యేకంగా అభినందించారు. ఈ
కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు వై.వి.సురేష్ కుమార్, ఉపాధ్యాయులు సునీత ఆబేదాబేగం, నాగమణి, వరప్రసాద్, యాదయ్య, స్వరూపలు పాల్గొన్నారు.