Take a fresh look at your lifestyle.

నైతిక విలువలు కాపాడుతూ నాణ్యమైన విద్యను అందించాలి

  • ప్రైవేటు రంగంలో సమాజ సేవ ఎంతో అవసరం.
  • విద్యార్థులు లక్ష్యం దిశగా ముందుకు సాగాలి.
  • జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి.

ముద్ర ప్రతినిధి కరీంనగర్ : విద్యాలయాలు నైతిక విలువలు కాపాడుతూ నాణ్యమైన విద్యను అందించాలని, ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు సమాజానికి ఉపయోగపడేలా పలు సేవలు చేసేందుకు ముందుకు రావాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు.తీగలగుట్టపల్లి లోని మహాలక్ష్మి కన్వెన్షన్ లో పారమిత విద్యాసంస్థల ఆధ్వర్యంలో స్కూల్ లీడర్ షిప్ కాన్ఫరెన్స్ జరిగింది. మేనేజింగ్ ది చేంజ్ ఇన్ ఎడ్యుకేషన్ అనే అంశంపై సెమినార్ నిర్వహించారు.ఈ కార్యక్రమానికి హాజరైన కలెక్టర్ మాట్లాడుతూ ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతోపాటు ఆటలు,విజ్ఞానం సాహిత్యం వంటి ఎన్నో అంశాలతో కూడిన సమగ్ర విద్యను అందిస్తున్నారని, అయితే సమాజ సేవ కూడా ఎంతో అవసరమని అన్నారు.కరీంనగర్ జిల్లాలో ప్రైవేటు, ప్రభుత్వ భాగస్వామ్యంతో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు మేలు చేయాలని సంకల్పించామని తెలిపారు. ప్రభుత్వ ప్రైవేటు ఎంఓయూ లో భాగంగా ప్రైవేట్ పాఠశాలలతో ఒప్పందం చేసుకొని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు టెడ్ ఎడ్, క్రీడలు, కంప్యూటర్ స్విమ్మింగ్ తదితర రంగాలలో శిక్షణ ఇప్పిస్తున్నామని తెలిపారు. ఇందుకు ముందుకు వచ్చిన జిల్లాలోని చాలా ప్రైవేట్ పాఠశాలలు తమ సేవా నిరతిని చాటుకున్నాయని అన్నారు. అనేకమంది ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఉచితంగా, విజయవంతంగా శిక్షణను అందించాలని తెలిపారు.గతంలో ప్రభుత్వ పాఠశాలను మధ్యాహ్న భోజన భోజన పథకంగా మాత్రమే భావించే వాళ్ళని, ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య ప్రధాన కర్తవ్యంగా మారిందని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఎన్నో రకాల సౌకర్యాలను సమకూర్చి ప్రభుత్వ విద్యార్థులను ఉన్నత స్థానంలో నిలిపేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. నిష్ణాతులైన ఉపాధ్యాయులు ప్రభుత్వ పాఠశాలలో బోధన అందిస్తున్నారని గుర్తు చేశారు. ఇది విద్యారంగంలో సంభవించిన గొప్ప మార్పు అన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు ఏవైనా నైతిక విలువలను కాపాడుతూ నాణ్యమైన విద్యను అందించాలని అన్నారు.జీవితంలో ప్రతి ఒక్కరూ ఎంతోమంది విజేతలను చూసి ఉంటారని, కానీ ఆ విజయం వెనక ఎంతో కృషి పట్టుదల ఉంటుందని అన్నారు. విద్యార్థులు కూడా ఏ పాఠశాలల్లో చదివినా ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకొని ఆ గమ్యం చేరుకునేలా పట్టుదల, ఏకాగ్రతతో చదవాలని అన్నారు.ఈ సందర్భంగా ప్రభుత్వ అందులో పాఠశాల విద్యార్థులు ఆలపించిన గేయాలు ఆకట్టుకున్నాయి.ఈ కార్యక్రమంలో పారమిత విద్యాసంస్థల చైర్మన్ ప్రసాదరావు, ప్రైవేట్ పాఠశాలల యాజమాన్య సంఘం బాధ్యులు మధుసూదన్ రావు, యాదగిరి శేఖర్ రావు, యాదగిరి, జిల్లా బాలికల అభివృద్ధి అధికారి కృపారాణి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ టి.ఎస్.వి రమణ, ప్రొఫెసర్లు రాజా రామ్ శర్మ, డాక్టర్ విద్య పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.