Take a fresh look at your lifestyle.

విశారాధన్ మహారాజ్ అరెస్టుకు నిరసనగా నాగర్ కర్నూల్‌లో రాస్తారోకో

నాగర్ కర్నూల్, ముద్ర ప్రతినిధి:
ఖమ్మం జిల్లా ప్రజల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఖమ్మం కలెక్టర్‌ను కలిసేందుకు వెళ్లిన బీసీ జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు విశారాధన్ మహారాజ్‌ను అక్రమంగా అరెస్టు చేయడాన్ని ఖండిస్తూ సోమవారం నాగర్ కర్నూల్‌లో ధర్మ సమాజ్ పార్టీ, బీసీ జేఏసీ నాయకులు బస్టాండ్ ముందు రాస్తారోకో నిర్వహించారు.
అరెస్టును తక్షణమే రద్దు చేసి విశారాధన్ మహారాజ్‌ను వెంటనే విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా కొంతసేపు రాకపోకలు అంతరాయం కలిగాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు.
నిరసనకారులు అరెస్టును తీవ్రంగా ఖండిస్తూ ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు, కోఆర్డినేటర్ సాయి మహారాజ్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.