Take a fresh look at your lifestyle.

అంగన్వాడి కేంద్రాల బలోపేతానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కృషి

  • గ్రామాల అభివృద్ధి కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం.
  • తండ్రిని కోల్పోయిన చిన్నారులకు అండగా నిలిచిన ఎమ్మెల్యే.
  • వెంపటిలో అంగన్వాడి, తుంగతుర్తి లో గ్రామపంచాయతీ భవనాల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే మందుల సామేల్.

 ముద్ర, తుంగతుర్తి : అంగన్వాడి కేంద్రాల బలోపేతానికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే మందుల సామెల్ అన్నారు. శనివారం తుంగతుర్తి మండల కేంద్రం లో నూతన గ్రామపంచాయతీ భవన నిర్మాణం,వెంపటి గ్రామంలో ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో నిర్మించనున్న నూతన అంగన్వాడి భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రజాపాలనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచన మేరకు తెలంగాణ అంగన్వాడీ కేంద్రాలు నూతన ఓరువడిని సంతరించు కుంటున్నాయనీ తెలిపారు. గత ప్రభుత్వం గ్రామాలను నిర్వీర్యం చేసిందన్నారు. గ్రామీణ ప్రాంతాలకు నిధులు కేటాయించకుండా వివక్ష చూపించడంతో.. చాలా గ్రామాలు అభివృద్ధికి నోచుకోలేదని గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ప్రతి గ్రామానికి ప్రత్యేక నిధులు కేటాయించి అభివృద్ధి చేస్తున్నామన్నారు. ఎన్ఆర్ఇజిఎస్ నిధులతో వెంపటి అంగన్వాడి భవనానికి రూ.12 లక్షలు, తుంగతుర్తి గ్రామపంచాయతీ భవనానికి రూ.20 లక్షల అంచనాతో నిర్మించే ఈ భవన పనులను త్వరగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. గ్రామంలోని ఎస్సీ పాత కాలనీలో కమిటీ హాల్ నిర్మాణానికి, కొత్త కాలనీలోని కమిటీ హాల్ ప్రహరీ గోడ నిర్మాణానికి, సీసీ రోడ్డు, ప్రాథమిక పాఠశాలలో అదనపు తరగతి గదుల ను మంజూరు చేయిస్తానని తెలియజేస్తూ గ్రామ అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. వెంపటి గ్రామానికి చెందిన సన్నాయిల వెంకటేష్ ఇటీవల గుండెపోటుతో మరణించగా మృతుడి పిల్లలను పరామర్శించి ధైర్యం చెప్పి వారికి రూ.50 వేల ఆర్థిక సహాయం చేస్తానని హామీ ఇచ్చారు. సన్నాయిల ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ తీగల గిరిధర్ రెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ చింతకుంట్ల వెంకన్న, తహసిల్దార్ దయానందం, ఎంపీడీవో శేషు కుమార్, సిడిపిఓ శ్రీజ, పంచాయతీరాజ్ డి ఈ లింగా నాయ, ఏ ఈ మహేష్, గ్రామ కార్యదర్శి వీరేందర్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు దొంగరీ గోవర్ధన్, ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు తప్పట్ల శంకర్, గ్రామ శాఖ అధ్యక్షుడు మాదర బోయిన రవి, గ్రామ శాఖ ఉపాధ్యక్షులు పుల్లూరు రమేష్,సంవిధాన్ మండల కోఆర్డినేటర్ మాచర్ల అనిల్, మాజీ సర్పంచ్ అబ్బ గాని పద్మ సత్యనారాయణ గౌడ్, తుంగతుర్తి పట్టణ అధ్యక్షుడు ఉప్పుల రాంబాబు, దేవాలయ చైర్మన్ సంజీవ,కాంగ్రెస్ పార్టీ నాయకులు దాయం ఝాన్సీ కటకం వెంకటేశ్వర్లు, వీరబోయిన రాములు,పెద్ద బోయిన అజయ్, కొండ రాజు, గంగ రాజు, తడకమల్ల రమేష్, కలకొట్ల మల్లేష్, దాసరి శ్రీను, సూదగాని రాజయ్య, దేవరపు రమేష్, కొండ వెంకన్న, సంజీవ రెడ్డి, మురగుండ్ల వీరయ్య, ముత్యాల వెంకటేశ్వర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.