గొల్లపల్లి, ముద్ర విలేకరి : తెలంగాణ సంస్కృతిలో భాగమైన పండగలలో ఒకటైన బోనాల పండుగ ఆషాడ మాసం పురస్కరించుకొని, జగిత్యాల జిల్లాలోని గొల్లపల్లి మండల కేంద్రంలో గల ఆదర్శ పాఠశాలలో ప్రిన్సిపల్ సుంకరి రవి ఆధ్వర్యంలో శనివారం అంగరంగ వైభవంగా తెలంగాణ బోనాల పండుగ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. పాఠశాలను రంగులతో ముస్తాబు చేసి పాఠశాల ఆవరణలో విద్యార్థినీలు భక్తి శ్రద్ధలతో బోనాలను వండి బోనాలతో,పోతరాజు, పులి వేషాలు కొలటలతో,ఊరేగింపుగా పోచమ్మ ఆలయం వద్ద అమ్మవారికి బోనాలను, నైవేద్యాలను, మొక్కులను సమర్పించారు.వారి అద్భుతమైన విన్యాసాలు ఎంతగానో ఆకట్టుకున్నాయని వారు తెలిపారు.తెలంగాణ రాష్ట్ర బోనాల పండుగను తమ పాఠశాలలో జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందని, దీని ద్వారా విద్యార్థులకు తెలంగాణ కళలు, సంస్కృతి సామాజిక సంబంధాలు, మొదల అంశాలపైన ప్రత్యక్ష అనుభవం కలుగుతుందని, ఇవి విద్యార్థి మూర్తిమత్వం అభివృద్ధి చెందడానికి ఎంతగానో దోహదపడుతుందని ఆయన తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.
