ముద్ర కాప్రా:
రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు ఇతర రాష్ట్రాలకు కూడా ఆదర్శంగా నిలుస్తున్నాయని ఉప్పల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మందుముల పరమేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు.
అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్రంలో ప్రజా పాలన నడుస్తోందన్నారు. దీంతో అన్ని వర్గాల ప్రజలకు ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు.
నాచారం ప్రాంతానికి చెందిన సామాజిక కార్యకర్త సోమ భావన గౌడ్, తన అనుచరులు పెద్ద సంఖ్యలో పరమేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.
ఈ సందర్భంగా నాచారంలోని వైజయంతి థియేటర్ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమానికి పరమేశ్వర్ రెడ్డి విచ్చేసి మాట్లాడారు. భావన గౌడ్, ఆమె అనుచరులను పరమేశ్వర్ రెడ్డి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.