బోథ్, ముద్ర:
అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందేలా చూస్తానని కాంగ్రెస్ పార్టీ బోథ్ నియోజకవర్గ ఇంచార్జి ఆడే గజేందర్ అన్నారు. గురువారం ఆయన బోథ్ నియోజకవర్గంలో లోని వివిధ మండలాలకు చెందిన రూ.10 లక్షల ఐదు వేల విలువైన ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను 19 మంది లబ్ధిదారులకు నేరడిగొండ మండలంలోని ఆయన క్యాంప్ కార్యాలయంలో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద ప్రజలకు అత్యవసర సమయంలో ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా అందే నగదు ఎంతో ఉపయోగ పడుతుందని అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ప్రభుత్వ పథకాలను ఉపయోగించుకోవాలని కోరారు. ప్రజా సమస్యల పరిష్కారానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. నియోజకవర్గంలో ఎవరికి ఏ అవసరం వచ్చినా తనను సంప్రదించాలని తాను ఎప్పుడూ అందుబాటులోనే ఉంటానని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు పాల్గొన్నారు.