మాదాపూర్, ముద్ర: మాజీ మంత్రి, భారాసా నర్సాపూర్ ఎమ్మెల్యే వాకిటి సునీతాలక్ష్మారెడ్డి జన్మదిన వేడుకలు మాదాపూర్ లోని తన నివాసం లో ఘనంగా జరిగాయి. పార్టీ కార్యకర్తలు, అభిమానులు, కుటుంబ సభ్యుల కొలహలం మధ్య 50 కిలోల కు పైగా బరువున్న కేక్ ను అభిమానుల మధ్య కట్ చేశారు. కార్యకర్తలు పుష్ప గుచ్ఛం అందచేసి, శాలువాలతో సన్మానించారు. అనంతరం కార్యకర్తలనుద్దేశించి మాట్లాడుతూ తన సుధీర్ఘ రాజకీయ జీవితంలో వెన్నంటి ఉంటూ ఇంతటి ఆధారాభిమానాలు చూపిస్తున్న కార్యకర్తలు, అభిమానులకు, నియోజకవర్గ ప్రజలకు రుణపడి ఉంటానన్నారు. ఇలాగే తనపై ఎల్లప్పడూ ఆధారాభిమానాలు కొనసాగించాలని సునీతలక్ష్మారెడ్డి కోరారు.