ముద్ర ప్రతినిధి,కామారెడ్డి: కామారెడ్డి జిల్లా ఎస్పీగా యం. రాజేశ్ చంద్ర సోమవారం బాధ్యతలు స్వీకరించారు.రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు జిల్లా ఎస్పీగా నియమించబడిన యం రాజేష్ సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో సింధు శర్మ నుండి బాధ్యతలు స్వీకరించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లా పరిధిలోని ప్రజలకు పోలీసులు నిరంతరం అందుబాటులో ఉంటూ చట్ట పరిధిలో ప్రజల సమస్యలను పరిష్కారం చేస్తూ ప్రజల భద్రత, రక్షణే ప్రధాన లక్ష్యమని అన్నారు.ఈ సందర్భంగా జిల్లా పోలీస్ అధికారులు ఎస్పీ ని మర్యాదపూర్వకంగా కలుసుకోని పుష్పాగుచ్చాలు ఇచ్చి అభినందనలు తెలిపారు.