ముద్ర ప్రతినిధి, వనపర్తి: అత్యాశకు వెళ్లి సైబర్ నేరస్తుల ప్రలోభానికి గురి కావద్దని, తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు అర్జించాలనే మన అత్యాశను సైబర్ నేరగాళ్లు లాభాలుగా మార్చుకుంటారని, అపరిచిత వెబ్సైట్లో లాగిన్ అయ్యి బ్యాంకు ఖాతాలో ఉన్న డబ్బులను పోగొట్టుకోవద్దు, మరియు చైన్ సిస్టం వంటి స్కాంలో మోసపోవద్దు అని జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ న్యాయమూర్తి వి రజని అన్నారు.మంగళవారం వనపర్తి లోని ప్రధానమంత్రి కౌశల్ యోజన కేంద్రంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో నైపుణ్యాలను అభివృద్ధి చేసుకుంటున్న విద్యార్థులకు చట్టాలపై అవగాహన సదస్సు జరిగింది.ఈ సదస్సులో ఆమె ముఖ్యఅతిథిగా హాజరయ్యి మాట్లాడారు.జిల్లా న్యాయ సేవ సంస్థ పనితీరు గురించి ఏ విధముగా సంస్థ సమావేశాలు ఏర్పాటు చేసి ప్రజలలో,విద్యార్థులలో చట్టాలపై అవగాహన కల్పిస్తుందో తెలియజేశారు.కార్యక్రమము ముఖ్య ఉద్దేశమైన చట్టాలను వివరించడంలో భాగంగా బాల్యవివాహాల చట్టం పోక్సో యాక్ట్ మోటార్ వెహికల్ యాక్ట్ బాల కార్మికుల చట్టం గురించి తెలియజేశారు.ఉచిత న్యాయ సలహాల కొరకు 15100 టోల్ ఫ్రీ నెంబర్ ను సంప్రదించవచ్చు అని తెలియజేశారు.కార్యక్రమంలో కేంద్రం మేనేజర్ చంద్రశేఖర్ రెడ్డి, జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ సిబ్బంది పాల్గొన్నారు.