ముద్ర ప్రతినిధి, భువనగిరి :
రోజురోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు సూచించారు.
శనివారం జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు అధ్యక్షతన నేషనల్ హీట్ రిలేటెడ్ ఇల్లీనెస్ అండ్ డెత్ సర్వే లైన్స్ డిస్టిక్ టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ, విద్యాశాఖ, డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ, వ్యవసాయ, పశుసంవర్ధక, పబ్లిక్ వర్క్స్, పర్యావరణ కాలుష్య నివారణ, గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్, మున్సిపల్ శాఖల అధికారులతో కలెక్టరేట్ ఐడీఓసీ మినీ మీటింగ్ హాల్‌లో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ భాస్కర్ రావు వడదెబ్బ వల్ల ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా ముందస్తు చర్యలతో సమగ్ర యాక్షన్ ప్లాన్ రూపొందించాలని అధికారులను ఆదేశించారు. జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ యం.మనోహర్ మాట్లాడుతూ, జిల్లా లో ఓఆర్ఎస్ ప్యాకెట్లు సంమృద్దిగా అందుబాటులో ఉన్నాయని ఇప్పటికే ప్యాకెట్లు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు పంపడం జరిగిందన్నారు.
ఈ సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ, విద్యాశాఖ, డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ, వ్యవసాయ, పశుసంవర్ధక, పబ్లిక్ వర్క్స్, పర్యావరణ కాలుష్య నివారణ, గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్, మున్సిపల్ శాఖల అధికారులు పాల్గొన్నారు.
Naresh is a Asst Editor and he is working with our organisation and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.