Take a fresh look at your lifestyle.

సీసీ రోడ్ ను ప్రారంభించిన వైస్ చైర్మన్ పోతంశెట్టి మంజుల

ముద్ర ప్రతినిధి, భువనగిరి :
భువనగిరి పట్టణంలోని 29వార్డ్ లో హెచ్ఎండిఏ నిధులతో సీసీ రోడ్ ను భువనగిరి మున్సిపల్ వైస్ చైర్మన్ పోతంశెట్టి మంజుల వెంకటేశ్వర్లు శనివారం ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధతో భువనగిరి మున్సిపల్ అభివృద్ధి పదం వైపు సాగుతుందని తెలిపారు. రానున్న రోజులలో మున్సిపాలిటీని మోడల్ మున్సిపాలిటీ గా అభివృద్ధి చేస్తాం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో బాలస్వామి, గ్యాస్ చిన్న, దొంత సావిత్రి, నర్సింహా, శ్రీధర్, వెంకటేష్, నితీష్ పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.