ముద్ర ప్రతినిధి,సంగారెడ్డి:
సంగారెడ్డి జిల్లా,హత్నూర మండలం కాసాల గ్రామంలో శుక్రవారం పాము కాటుతో బాలిక మృతి చెందింది. కుటుంబీకులు స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… మాచినూరు సింధుజ (17) దౌల్తాబాద్ లోని ప్రైవేట్ కళాశాలలో ఒకేషనల్ కోర్స్ చేస్తుంది.ఉగాది పండుగ కావడంతో ఇల్లును శుభ్రం చేస్తుండగా పాముకాటుకు గురైంది.ఏదో ఎలుక కరిచినట్టు అయిందని సాయంత్రం వరకు పట్టించుకోకపోవడంతో నురగలు రావడంతో హుటాహుటిన సంగారెడ్డి ఆసుపత్రికి తరలించగా మెరుగైన చికిత్స కోసం హైదరాబాదులోని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందినట్లు కుటుంబీకులు తెలిపారు.