Take a fresh look at your lifestyle.

అంకెల గారడీ బడ్జెట్ సీపీఎం జిల్లా కార్యదర్శి నర్సమ్మ

ముద్ర ప్రతినిధి, మెదక్:
తెలంగాణ బడ్జెట్ అంకెల గారడీ అని సీపీఎం జిల్లా కార్యదర్శి కె. నర్సమ్మ విమర్శించారు. కొత్త ప్రాజెక్టులు, మౌలిక వసతుల కోసం కేటాయించింది కేవలం 14.5 శాతం మాత్రమే. వ్యవసాయానికి 23,179 కోట్లు, విద్యకు 26,674 కోట్లు గతం కంటే తగ్గిందన్నారు. ప్రజా వైద్యం, ఆరోగ్యంకు 13,679 కోట్లు సరిపోవన్నారు. ఇందిరమ్మ ఇళ్లకు కేవలం 5,500 కోట్లు మాత్రమే కేటాయించారు. లక్షలాది మందికి ఇళ్లు కట్టడానికి ఈ నిధులు ఏ మూలకు సరిపోవన్నారు.
మొత్తంగా పరిశీలిస్తే రాష్ట్ర ప్రభుత్వం అంకెలకే పరిమితమైందన్నారు. ప్రజలకు ఉపయోగపడే విధంగా బడ్జెట్ లేదన్నారు.
నిధుల ఖర్చులో వైఫల్యం చెందిందన్నారు. ప్రభుత్వం పునరాలోచించి బడ్జెట్ కేటాయింపులు ముఖ్య రంగాలకు పెంచాలని ఆమె ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Leave A Reply

Your email address will not be published.