- రూపిరెడ్డిపల్లి లో పోస్ట్ ఆఫీస్ లేక ఇబ్బంది.
- ఫెన్షన్ తీసుకొలంటే ఐదు కిలో మీటర్లు పోవాల్సిందే.
ముద్ర ప్రతినిధి, భూపాలపల్లి రేగొండ : ఒకటో తారీకు వచ్చిందంటే చాలు..ఆసరా పెన్షన్ల కోసం ఆశగా ఎదురు చూస్తుంటారు. ఇక ప్రతి నెలా పోస్ట్ ఆఫీస్ లో పెన్షన్ దారులకు అవస్థలు మాత్రం తప్పడం లేదు. పోస్ట్ ఆఫీస్ సిబ్బంది సమయపాలన పాటించకపోవడంతో.. పింఛన్ కోసం వచ్చే వయసు పైబడిన బామ్మలు, తాతయ్యలు, అంగవైకల్యం కలిగిన వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పెన్షన్ల కోసం ఉదయం నుంచే పోస్ట్ ఆఫీస్ ముందు క్యూ కడుతున్నారు. ఉదయం సమయంలో తెరుచుకోవాల్సిన పోస్ట్ ఆఫీస్ తలుపులు ఇష్టారీతిన తెరుచుకుంటున్నాయి.పోస్ట్ ఆఫీస్ సిబ్బంది సమయపాలన పాటించకపోవడంతో..ఆఫీస్ ఎప్పుడు తెరుచుకుంటుందో, అసలు తెరుచుకుంటుందో లేదో కూడా తెలియని పరిస్థితి నెలకొందని పింఛన్ దారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రేగొండ మండలం రూపిరెడ్డి పల్లి గ్రామంలో పోస్ట్ ఆఫీస్ లేకపోవడం ప్రతి నేల పోస్ట్ ఆఫిసర్ ఎప్పుడు వస్తాడో తెలియని పరిస్థితి శుక్రవారం ఫెన్షన్ పంచేందుకు ముడు గంటల సమయంలో వచ్చి పది మంది వరకు పంపిణి చేసి మళ్ళీ సోమవారం వస్తాను లేదంటే దమ్మన్న పేటకు రండి అంటూ వెళ్లి పోవడంతో ఫెన్షన్ దారులు ఆవేదన చెందుతున్నారు.ఎప్పుడు వస్తాడో అంటూ పోస్టాఫీస్ ముందు ఉదయం 8 గంటల నుంచే పింఛన్ దారులు క్యూ కట్టారు. మిట్ట మధ్యాహ్నం అవుతున్నా పోస్ట్ ఆఫీస్ తెరుచుకోకపోవడంతో.. పింఛన్ దారులు పడిగాపులు కాచి నీరసించిపోయారు. ప్రతినెలా ఇదే తంతు కొనసాగుతోందని, ఎప్పుడొస్తారో, ఎప్పుడు పింఛన్లు ఇస్తారో తెలియని పరిస్థితి నెలకొందని పింఛన్ దారులు వాపోతున్నారు. ఉన్నతాధికారులు చొరవ తీసుకొని పరిస్థితిని చక్కదిద్దాలని పెన్షన్ దారులు డిమాండ్ చేస్తున్నారు.
