Take a fresh look at your lifestyle.

హరీష్ రావు అబద్దాలు మానుకో

  • నిజాలు ఇదిగో… అబద్ధాలు మానుకో.
  • హరీష్ రావుకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హితవు.
  • యాసంగిలో ధాన్యం కొనుగోళ్లలో రాష్ట్ర ప్రభుత్వం రికార్డు.
  • ఇప్పటి వరకు కొనుగోళ్లు 65 శాతం పూర్తి.
  • కిందటేడాది కంటే 44 శాతం అధికం.
  • రెండేళ్ల యాసంగి సీజన్ తో పోల్చి చూస్తే 120 శాతం అధికంగా కొనుగోళ్లు.
  • నేటి సాయంత్రానికి కొనుగోలు చేసిన ధాన్యం 43.10 లక్షల మెట్రిక్ టన్నులు.
  • 2022-23 తో పోల్చి చూస్తే కొనుగోలు చేసిన ధాన్యం 23.48 లక్షల మెట్రిక్ టన్నులు అధికం.
  • గతేడాదితో పోల్చి చూస్తే 13.22 లక్షల మెట్రిక్ టన్నులు అధికం.
  • రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ప్రారంభించిన కొనుగోలు కేంద్రాలు 8,245.
  • గతేడాదితో పోల్చి చూస్తే అదనంగా 1,067 కొనుగోలు కేంద్రాలు.
  • 6.58 లక్షల రైతులనుండి ధాన్యం కొనుగోలు.
  • కొనుగోలు చేసిన ధాన్యంలో 27.75 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దొడ్డు రకాలు,15.35 లక్షల మెట్రిక్ టన్నులు సన్నాలు.
  • ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యం విలువ 9999.36 కోట్లు.
  • ఇప్పటి వరకు ప్రభుత్వం చెల్లించింది 6,671 కోట్లు.
  • యాసంగి లోనూ సన్నాలకు 500 బోనస్.
  • చెల్లించాల్సిన బోనస్ మొత్తం 767 కోట్లు.
  • మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.

ముద్ర, తెలంగాణ బ్యూరో : ధాన్యం కొనుగోలు అంశంలో అబద్దాలు మానుకోవాలని మాజీ మంత్రి హరీష్ రావుకు రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి హితవు పలికారు.ప్రతిరోజు అబద్దాలను ప్రచారం చేస్తూ అవే నిజాలుగా ప్రజలను భ్రమింపచేసే ప్రయత్నం మానుకోవాలని ఆయన ఉద్బోధించారు.ఉన్నది లేనట్లు లేనిది ఉన్నట్టు అసత్య ప్రచారం చేస్తూ ప్రజలను ధాన్యం కొనుగోలు విషయంలో హరీష్ రావు తప్పు దోవ పట్టిస్తున్నారని ఆయన విరుచుకుపడ్డారు.ఈ మేరకు మంగళవారం సోషల్ మీడియా వేదికగా ఆయన ఒక ప్రకటన పోస్ట్ చేశారు.కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక మీరు గొప్పగా ప్రచారం చేసుకున్న కాళేశ్వరం నిరుపయోగంగా మారిన ఖరీఫ్, రబి సీజన్లను కలిపి దిగుబడి అయిన ధాన్యం 281లక్షల మెట్రిక్ టన్నులని ఆయన వివరించారు. యాసంగి సీజన్ లో ఇప్పటికే 65 శాతం మేర ధాన్యం కొనుగోళ్లు పూర్తి అయ్యాయని కిందటేడాది కంటే 44 శాతం అధికమని గడిచిన రెండేళ్ల యాసంగి సీజన్ తో పోల్చి చూస్తే 120 శాతం అధికంగా కొనుగోళ్లు జరిగాయని ఆయన వివరించారు.యాసంగి సీజన్ లోనూ ధాన్యం దిగుబడి లో తెలంగాణా రాష్ట్రం రికార్డు సాదించిందని ఆయన పేర్కొన్నారు.కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఖరీఫ్ సీజన్ లో 66.7 లక్షల ఎకరాలు సాగు చేస్తే 153.5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి అయ్యిందని, ప్రస్తుత యాసంగి సీజన్ లో 55 లక్షల ఎకరాల్లో సాగుచేస్తే 127 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి అంచనా వేస్తున్నామన్నారు.అంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంవత్సరం వ్యవదిలోనే ఖరీఫ్, రబీ సీజన్ లు కలిపి దిగుబడి అయ్యో మొత్తం కలిపి 280 లక్షల మెట్రిక్ టన్నులన్నారు.ధాన్యం దిగుబడి లో ఇదో చారిత్రాత్మకమైన రికార్డు గా ఆయన అభివర్ణించారు‌ ఈ యాసంగి సీజన్ లో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు 65 శాతం మేర ధాన్యం కొనుగోలు పూర్తి చేసిందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖామంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.మంగళవారం సాయంత్రం వరకు ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యం 43.10 లక్షల మెట్రిక్ టన్నులని ఆయన వెల్లడించారు.ఈ మేరకు ఆయన సోషల్ మీడియా వేదికగా విడుదల చేసిన ప్రకటనలో ధాన్యం కొనుగోలు వివరాలను సమగ్రంగా వివరించారు.2023-24 యాసంగి సీజన్ తో పోల్చి చూసినప్పుడు ఈ యాసంగి సీజన్ లో ప్రభుత్వం ఈ రోజు సాయంత్రం వరకు కొనుగోలు చేసింది 23.48 లక్షల మెట్రిక్ టన్నులు అధికంగా ఉన్నాయన్నారు. 2023-24 అంటే గతేడాదితో పోల్చి చూస్తే కూడా ప్రభుత్వం తాజగా కొనుగోలు చేసింది 13.22 లక్షల మెట్రిక్ టన్నులు అధికంగా కొనుగోలు చేశామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ప్రారంభించిన ధాన్యం కొనుగోలు కేంద్రాలు 8,245 అని గతేడాది కంటే అదనంగా 1,067 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించామన్నారు.ఈ యాసంగి సీజన్ లో 60.14 లక్షల ఎకరాలలో రైతులు సాగు చేయగా లక్షా 29 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి అవ్వుతుందని అంచనా వేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.అందులో 70.13 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వస్తున్నట్లు ప్రభుత్వం అంచనా వేస్తోందన్నారు‌. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 6.58 లక్షల మంది రైతుల నుండి ప్రభుత్వం ధాన్యాన్ని కొనుగోలు చేసిందన్నారు. ప్రభుత్వం కొనుగోలు చేసిన 43.10 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యంలో 27. 75 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాం దొడ్డు రకాలని,15.35 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాం సన్నాలు ఉన్నట్లు ఆయన తెలిపారు. ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యం మొత్తం విలువ రూ. 9,999.36 కోట్లు అని ఇప్పటి వరకు ప్రభుత్వం రైతులకు చెల్లించిన మొత్తం రూ‌ 6,671 కోట్లు అని ఆయన తెలిపారు.ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల వ్యవధిలోనే రైతుల ఖాతాలలో నగదును జమ చేస్తున్నామన్నారు.రాష్ట్ర ప్రభుత్వం సన్నాలను ప్రోత్సాహించేందుకు గాను అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన సన్నాలకు బోనస్ పధకం యాసంగి లోనూ అమలు పరుస్తున్నట్లు ఆయన చెప్పారు.సన్నాలకు క్వింటా ఒక్కింటికీ రూ. 500 బోనస్ చెల్లిస్తున్నామన్నారు.ప్రభుత్వం కొనుగోలు చేసిన సన్నాలకు అందించాల్సిన బోనస్ మొత్తం 767 కోట్లు అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆ ప్రకటనలో తెలిపారు.వివరాలు ఇలా ఉంటే హరీష్ రావు చేసిన ప్రకటన ప్రజలను తప్పు దోవ పట్టించే విదంగా ఉందని ఆయన ఆక్షేపించారు.

Leave A Reply

Your email address will not be published.