Take a fresh look at your lifestyle.

అలరించిన ఉగాది కవి సమ్మేళనం  పాల్గొన్న నందిని సిధారెడ్డి

ముద్ర ప్రతినిధి, మెదక్: 
తెలంగాణ రచయితల సంఘం మెదక్ జిల్లా ఆధ్వర్యంలో ఉగాది కవి సమ్మేళనం తెలంగాణ భవన్ లో శుక్రవారం నిర్వహించారు. ఈ కవి సమ్మేళనంలో ముఖ్య అథితులుగా తెలంగాణ సాహిత్య  అకాడమీ తొలి అధ్యక్షులు నందిని సిధారెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ కానుగు రాధిక , తెరసం రాష్ట ఉపాధ్యక్షులు దేవేందర్ రెడ్డి పాల్గొన్నారు. తె ర.సం. జిల్లా అధ్యక్షురాలు కవిత మాట్లాడుతూ…తెలంగాణలో నందిని సిధారెడ్డికి కేంద్ర సాహిత్య పురస్కారం వరించడం గర్వకారణం అన్నారు. చైర్ పర్సన్ రాధిక మాట్లాడుతూ..
మన మెతుకు సీమ బిడ్డకు కేంద్ర సాహిత్య పురస్కారం వరించడం మనందరికీ గర్వకారణం అన్నారు. కవులుగా మేమందరం గర్వపడుతున్నామన్నారు. అనంతరం సిధారెడ్డి ఘనంగా సన్మానించారు.
నందిని సిద్ధారెడ్డి మాట్లాడుతూ ఈ పురస్కారం కవులందరికీ వరించినట్టేనని అందరికీ ధన్యవాదములు అన్నారు. అనంతరం కవులు వినిపించిన కవితలతో సభ మార్మోగింది.
ఈ సమ్మేళనంలో కవులు, టిఎన్జీఓ కేంద్ర కమిటీ సభ్యురాలు అనురాధ, ఎం.డి ఇక్బాల్, కవయిత్రి అంజలి, ఉపాధ్యాయులు ఆంజాగౌడ్,  సినీ గేయ రచయిత సాయి సిరి, బుర్ర సంతోష్, వెంకటేశం, రాగుల మల్లేశం, దుర్గరాములు, నవీన్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.