Take a fresh look at your lifestyle.

దర్శనమిచ్చిన నెలవంక ముగిసిన ముస్లింల ఉపవాస దీక్షలు..

ప్రత్యేక ప్రార్థనలకు ఏర్పాట్లు చేసిన అధికారులు
ముస్తాబైన ఈద్గాలు
ముద్ర ప్రతినిధి, భువనగిరి : నెలవంక దర్శనంతో రంజాన్ పండుగ వచ్చేసింది. షవ్వాల్‌ మాసం నెలవంక కనిపించడంతో పుణ్యఫలాల పవిత్ర రంజాన్ మాసం 30 రోజుల ఉపవాస దీక్షలు ముగిశాయి. నెల రోజులపాటు కఠోర ఉపవాస దీక్షలు కొనసాగించిన ముస్లింలు శుక్రవారం దీక్షలు విరమించి సాయంత్రం 6.40 నుంచి రాత్రి 7.30 గంటల మధ్య నెలవంక దర్శనంతోనే మస్జీద్‌లలో సైరన్ లు మోగించి శనివారం రంజాన్ పండుగను జరుపుకొంటున్నట్టు ప్రకటించారు. ఈద్‌–ఉల్‌–ఫితర్‌ జరుపుకోవడానికి జిల్లాలోని ఈద్గాలు, మజీదులను ముస్తాబు చేశారు.
ఈద్‌–ఉల్‌–ఫితర్‌ నమాజ్‌ ప్రత్యేకం..
ఈద్‌–ఉల్‌–ఫితర్‌ నమాజ్‌ కోసం ఈద్గాలు, మసీదులను ముస్తాబు చేశారు. ఫజర్‌ నమాజ్‌ అనంతరం ఇష్రాఖ్‌ నమాజ్‌ సమయం ప్రారంభమైన తర్వాత నమాజ్‌ చేస్తారు. నమాజ్‌ కోసం ఆజాన్ , ఆఖామత్‌ చెప్పనవసరం లేదు. ఈ నమాజ్‌కు ముందు ఎలాంటి సున్నత్‌ నమాజ్‌లు చేయరాదు. ఇమామ్‌లు ఈద్‌–ఉల్‌–ఫితర్‌ గురించి ఉపదేశించి నియమాలు వివరిస్తారు. నమాజ్‌ అనంతరం ఖుద్బాను పఠిస్తారు. అనంతరం ఒకరినొకరు ఆలింగంనం చేసుకొని పండుగ శుభాకాంక్షలు తెలుపుకొంటారు.
పాత ఈద్గాలోనే ప్రత్యేక నమాజ్ః భువనగిరి పట్టణంలోని హైద్రాబాద్‌ చౌరస్తాలోని పాత ఈద్గాతో పాటు, పెద్ద చెరువు కింద ఉన్న స్థలంలో సైతం గతంలో ఈద్‌ నమాజ్‌ చేసే వారు కాగా కొన్ని అనువర్యా కార్యాయంతో కేవలం పాత ఈద్గా వద్ద ప్రత్యేక నమాజ్‌ అచరణ కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా పెద్ద ఎత్తున్న ముస్లింలు నమాజ్‌ కోసం వస్తారని కాబట్టి స్థల బావం వల్ల సమికృత మార్కెట్‌యార్డులో సైతం ఏర్పాట్లు చేశారు. ఉదయం 9.30 గంటలకు ప్రత్యేక నమాజ్‌ చేస్తారు. కాగా అదనపు కలెక్టర్‌ భాస్కర్‌రావు, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ తంగళ్ళపల్లి శ్రీవాణిరవికుమార్‌ ఏర్పాట్లు పరిశీలిచారు.

Leave A Reply

Your email address will not be published.