Take a fresh look at your lifestyle.

అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు వర్తింపజేయాలి

  • మున్సిపల్ కమిషనర్ కు సీపీఎం నేతల వినతీ

ముద్ర, ఇబ్రహీంపట్నం: అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు వర్తింపజేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బి సామెల్ డిమాండ్ చేశారు.ఈ మేరకు సోమవారం ఇబ్రహీంపట్నం మున్సిపల్ కమిషనర్ రవీందర్ సాగర్ కు సీపీఎం నాయకులు వినతి పత్రం అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపాలిటీలో గత 8 సంవత్సరాల నుండి పింఛన్లు రాక, రేషన్ కార్డులు లేక ఎంతో మంది ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి పింఛన్లు,రేషన్ కార్డులు అందజేయాలని అదేవిధంగా అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లు అందజేయాలని డిమాండ్ చేశారు.మున్సిపాలిటీలోని వివిధ కాలనీల్లో నెలకొన్న మౌలిక సదుపాయాల సమస్యలను పరిష్కరించాలని కోరారు.ఈ కార్యక్రమంలో సీపీఎం మున్సిపల్ కార్యదర్శి చింతపట్ల ఎల్లేశ, మున్సిపల్ కమిటీ సభ్యులు చెనమోని శంకర్, ఎర్పుల వీరేశం, చీమల ముసలయ్య, నూతనగంటి పురుషోత్తం, బోడ యాదగిరి, హనుమంతు మహేష్, హనుమంతు శివ, కామ్ శెట్టి సుశీల, లలిత, శశికళ, సీహెచ్ పద్మ తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.