Take a fresh look at your lifestyle.

కోడి పిల్లకు రెండు తలలు, ఆశ్చర్యంగా తిలకరించిన ప్రజలు

ముద్ర, మల్యాల: ప్రపంచంలో వింత ఘటనలెన్నో జరుగుతుంటాయి. అరుదుగా జరిగే ఆ వింతలు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తాయి. తాజాగా మండలంలోని ముత్యంపేట (కొండగట్టు)లో అరుదైన ఘటన చోటుచేసుకుంది.గ్రామానికి చెందిన సిక్కుల శారద అనే మహిళ కోళ్లను పెంచుకుంటున్న తన కోళ్ల కోడిగుడ్లను పొదిగించగా, సోమవారం ఉదయం కోడి పిల్లలను పరిశీలించగా,ఒక కోడి పిల్లకు రెండు తలలతో ఉండటం ఆశ్చర్యానికి గురైంది. రెండు తలలతో పుట్టిన కోడి పిల్లను పలువురు తిలకరించారు. సాయంత్రం సమయంలో ఆ కోడి పిల్ల మృతి చెందినట్లు స్థానికుల ద్వారా తెలిసింది.

Leave A Reply

Your email address will not be published.