- మార్కెట్ కమిటీ చైర్మన్ అంజిరెడ్డి
కోరుట్ల, ముద్ర: మామిడి వ్యాపారులు లైసెన్స్ లేకుండా వ్యాపారం నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కోరుట్ల మార్కెట్ కమిటీ చైర్మన్ పన్నాల అంజిరెడ్డి, సెక్రెటరీ ఎం ప్రశాంత్ స్పష్టం చేశారు.సోమవారం కోరుట్ల పట్టణంలోని మార్కెట్ యార్డులో ఏర్పాటుచేసిన మామిడి వ్యాపారుల సమావేశంలో వారు హాజరై వ్యాపారులకు పలు సూచనలు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ వ్యాపారులు ప్రభుత్వం నిర్ణయించిన ఆదేశాలు, నిబంధనల మేరకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. మార్కెట్ యార్డు ద్వారా ఎలాంటి సహాయ సహకారాలు అవసరమైన అందజేయడానికి తాము ఎల్లవేళలా సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు.వ్యాపారులు తమ లైసెన్సులను గడువు లోపు రెన్యువల్ చేసుకోవాలని సూచించారు.ఈ సందర్భంగా మార్కెట్ చైర్మన్ అంజిరెడ్డి, సెక్రెటరీ ప్రశాంత్ లను శాలువాతో ఘనంగా సత్కరించారు.ఈ కార్యక్రమంలో మ్యాంగో అసోసియేషన్ సంఘం అధ్యక్షులు అజీమ్, ఉపాధ్యక్షులు వెంకట్రెడ్డి శ్రీనివాస్, కార్యదర్శి వాషింగ్, కోశాధికారి రెహమాన్, గౌరవ సలహాదారులు ఎడ్ల రమేష్, ఉరుమడ్ల శ్రీనివాస్, కళాల భూమ సాయిలు, ఇషాక్ ఉరుమడ్ల చరణ్, ఎడ్ల శంకర్, ఎడ్ల నవీన్, బషీర్ కాజా, తదితరులు పాల్గొన్నారు.