- మందమర్రి జిఎం దేవేందర్.
రామకృష్ణాపూర్, ముద్ర విలేకరి : క్రీడాకారులు పోటీలలో క్రీడా స్ఫూర్తితో ఆడితేనే విజయం సాధిస్తారని మందమర్రి ఏరియా సింగరేణి జనరల్ మేనేజర్ జీ.దేవేందర్ అన్నారు. స్థానిక సింగరేణి ఠాగూర్ స్టేడియంలో మూడు రోజులుగా జరిగిన తెలంగాణ రాష్ట్ర అండర్ 15 జూనియర్ బాలికల ఫుట్ బాల్ పోటీలు శుక్రవారంతో ముగిశాయి.నిజామాబాద్ ఖమ్మం జట్ల మధ్య హోరా హోరీగా సాగిన ఫైనల్ మ్యాచ్లో నిజామాబాద్ జట్టు 3-0 తో చాంపియన్షిప్ విజేతగా నిలిచారు. అనంతరం గెలుపొందిన జట్ల క్రీడాకారులకు ట్రోఫీ,బహుమతులను అందజేశారు. పట్టణ ఎస్సై జీ.రాజశేఖర్,మున్సిపల్ కమిషనర్ గద్దె రాజు,ఏఈ అచ్యుత్,పర్సనల్ మేనేజర్ శ్యాంసుందర్,పట్టణ అధ్యక్షుడు పల్లె రాజు,పిన్నింటి రఘునాథ్ రెడ్డి,గాండ్ల సమ్మయ్య, మాజీ వైస్ చైర్మన్ విద్యా సాగర్,గోపు రాజాం,ఈశ్వరచారి,రాజు, శ్రీనివాస్,తదితరులు పాల్గొన్నారు.
