Take a fresh look at your lifestyle.

తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా

 

ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్:

నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్లమెంట్ అధికార ప్రతినిధి, అడక్ కమిటీ మెంబర్ రమేష్ కొప్పుల ఆధ్వర్యంలో పార్టీ జెండాను ఎగురవేశారు.

తదుపరి నందమూరి తారక రామారావు చిత్రపటానికి పూలమాలలు అర్పించి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, నందమూరి అభిమానులు భారీగా పాల్గొని ఉత్సాహంగా వేడుకలను జరుపుకున్నారు.

Leave A Reply

Your email address will not be published.