బండి సంజయ్.. రైతులకు యూరియా అందించాల్సిన బాధ్యత నీకు లేదా
రాష్ట్రానికి కేంద్రం ఇచ్చే వాటా గురించి మాట్లాడవా
ప్రజాస్వామ్యం గురించి గంగుల కమలాకర్ మాట్లాడటం సిగ్గుచేటు
గంగుల కమలాకర్, బండి సంజయ్ పై సుడా చైర్మన్ నరేందర్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు
రాష్ట్రంలో రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం ఇబ్బందులు పెడుతోందని, యూరియా ఇవ్వకుండా మోసం చేస్తోందని బండి సంజయ్ మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించినట్లే ఉందని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి అన్నారు.. రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన యూరియా వాటాను సకాలంలో అందించకుండా బిజెపి సర్కార్ మోసం చేసిందని మండిపడ్డారు.. కేంద్రం వాటా నిలిపేసి బదనాం మాత్రం రాష్ట్ర ప్రభుత్వంపై నెట్టేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కు రైతులు ఓట్లు వేయలేదా అని నరేందర్ రెడ్డి ప్రశ్నించారు. యూరియా పై కేంద్ర మంత్రి బండి సంజయ్ కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయాలని, రాష్ట్రానికి వచ్చే వాటా విషయంలో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సుడా చైర్మన్ కోరారు..రైతాంగం దగ్గర రాష్ట్ర ప్రభుత్వాన్ని కావాలనే బదనాం చేసే ప్రయత్నం జరుగుతోందని మండిపడ్డారు. ఇదే సమయంలో ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నారని, ఓటుకు పదివేల రూపాయలు ఇచ్చి కొంటున్నారని గంగుల కమలాకర్ చేసిన ఆరోపణ పైన కూడా సుడా చైర్మన్ స్పందించారు. ప్రజాస్వామ్యాన్ని అపవాస్యం చేసింది టిఆర్ఎస్ ప్రభుత్వమే అని, విచ్చలవిడిగా టిఆర్ఎస్ హయాంలోనే డబ్బుల పంపిణీ జరిగిందని సుడా చైర్మన్ ఆరోపించారు. ఓటర్లను గంగుల కమలాకర్ అవమానిస్తున్నారని అన్నారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని బిఆర్ఎస్ కు కాంగ్రెస్ కు మధ్య పాలనను ప్రజలు తెలుసుకున్నారని సుడా చైర్మన్ అన్నారు..