Take a fresh look at your lifestyle.

కేంద్ర ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి

  • జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ రామ్ కుమార్

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: కేంద్ర ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ రామ్ కుమార్ అన్నారు. కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సేవల విభాగం, కేంద్ర ప్రభుత్వ ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జూలై 1 నుండి సెప్టెంబర్ 30 వరకు కేంద్ర ప్రభుత్వ సామాజిక భద్రత భీమా పథకాలైన ప్రధాన మంత్రి జీవనజ్యోతి భీమా యోజన, ప్రధాన మంత్రి సురక్షా భీమా యోజన, అటల్ పెన్షన్ యోజన అర్హులైన వారందరికీ నమోదు కొరకు దేశ వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో వివిధ బ్యాంకు శాఖల ద్వారా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా మంగళవారం తెలంగాణ గ్రామీణ బ్యాంక్, అల్లీపూర్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ రామ్ కుమార్ పాల్గొని మాట్లాడుతూ సామాజిక భద్రత భీమా పథకాలపై అవగాహన కల్పించి నమోదు చేసేలా ప్రత్యేక ప్రణాళిక రూపొందించామని తెలిపారు. జిల్లా పరిధిలోని అన్ని బ్యాంకులు ప్రణాళికను అనుసరించి కార్యక్రమాలు నిర్వహించాలని నమోదులో జిల్లాను అగ్రగామిగా నిలపాలని కోరారు. అర్హులైన ప్రతి ఒక్కరూ భీమా కలిగి ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎఫ్ఎల్సీ మధు సూదన్, టిజీబి అల్లీపూర్ శాఖ అధికారులు సురేష్, శ్రీధర్, సిఫెల్ కౌన్సిలర్లు నాగేంద్ర ప్రసాద్, నవీన్ కుమార్, మహేష్, మహిళా సంఘాల సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.