ముద్ర ప్రతినిధి కల్వకుర్తి: కల్వకుర్తి పట్టణంలో విశ్వహిందూ పరిషత్, శ్రీ లక్ష్మీపద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి దేవస్థానం వారు సంయుక్తంగా నిర్వహించిన చిన్నారులకు గీతా పారాయణం కార్యక్రమం ముగింపు వేడుకలు వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఘనంగా జరిగాయి.40 రోజులపాటు చిన్నారులకు గీతా పారాయణం సాధన జరిగింది. ఈ సందర్భంగా ఆలయ ఫౌండర్ ట్రస్టీ కల్వ మనోహర్ మాట్లాడుతూ సనాతన ధర్మం అమెరికా యూరప్ లాంటి విదేశాల్లో ఎంతో గొప్పగా కీర్తించబడుతుంది కానీ ఇక్కడి యువత పాశ్చాత్య పోకడ పోవడం వలన సనాతన ధర్మం యొక్క గొప్పతనం తెలుసుకోలేక పోతున్నారని అన్నారు.సనాతన ధర్మం యొక్క విలువలను చిన్నారులలో పెంపొందించాలని లక్ష్యంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని తెలిపారు.చిన్నారులు కూడా ఎంతో భక్తిశ్రద్ధలతో నేర్చుకోవడం ఎంతో సంతోషం కలిగించిందని వచ్చే ఏడాది మరింత అద్భుతంగా జరగాలని ఆశాభావం వ్యక్తం చేశారు.భాజపా నాయకుడు రాంభూపాల్ రెడ్డి చిన్నారులకు బహుమతులు అందజేశారు.కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ జిల్లా ఉపాధ్యక్షురాలు సుకన్య, వరలక్ష్మి, తిరుపతయ్య, బృంగి శీను, రవిచంద్ర, కొండూరు శీను, నరెడ్ల శేఖర్ రెడ్డి, కల్వ హరి, నర్సిరెడ్డి, గన్నోజు బాబిదేవ్, బోడ యాదగిరి, చిన్నారుల తల్లిదండ్రులు భక్తులు పాల్గొన్నారు.