Take a fresh look at your lifestyle.

కల్యాణ లక్ష్మి చెక్కుల అందజేసిన ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్

ముద్ర ప్రతినిధి, మెదక్:
హవేలీ ఘనపూర్ మండల కేంద్రంలో కల్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ ఎమ్మెల్యే డా. మైనంపల్లి రోహిత్ రావు అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాలలో భాగంగా కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పేద కుటుంబాల ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కళ్యాణ లక్ష్మి పథకం ఎంతో ఉపయోగకరమని తెలిపారు. అనంతరం పంచముఖి హనుమాన్ దేవాలయం సమీపంలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించారు. మున్సిపాలిటీలో రెండు వాటర్ ట్యాంకర్లు ప్రారంభించారు. మున్సిపల్ చైర్పర్సన్ కానుక రాధికా భూపతి రాజు, వైస్ చైర్మన్ దొంతి నరేష్ గౌడ్, హవెలి ఘనపూర్ తహసీల్దార్ సింధు రేణుక, జిల్లా యువజన అధ్యక్షులు పర్శరాం గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.