ముద్ర కూకట్‌పల్లి:
రాబోయే వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని కెపిహెచ్‌బి కాలనీ, వసంత నగర్ పరిసర ప్రాంతాల్లోని అన్ని ఫేజ్‌లకు తాగునీటి సరఫరా సక్రమంగా అందించాలని కోరుతూ కెపిహెచ్‌బి సర్కిల్ వాటర్ వర్క్స్ డిజిఎం త్రినాథ్‌ను కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు వినతిపత్రం అందజేశారు.
కూకట్‌పల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జ్ బండి రమేష్ ఆదేశాల మేరకు ప్రతి కాలనీలో పర్యటిస్తూ ప్రజా సమస్యలను తెలుసుకుంటున్నామని నాయకులు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో అందుతున్న అభివృద్ధి ఫలాలు అట్టడుగున ఉన్న ప్రతి పేదవాడికి చేరాలన్నదే తమ లక్ష్యమని వారు స్పష్టం చేశారు.డిజిఎం త్రినాథ్‌కు ఈ నియోజకవర్గ సమస్యలపై పూర్తి అవగాహన ఉందని, గతంలో ఆయన ఇక్కడ చేసిన పనితీరును నాయకులు ఈ సందర్భంగా గుర్తు చేశారు. రాబోయే ఎండల తీవ్రతను బట్టి ప్రజలకు ఎటువంటి తాగునీటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.
Naresh is a Asst Editor and he is working with our organisation and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.
Prev Post
Next Post