ముద్ర : మల్కాజిగిరి
మల్కాజిగిరి డివిజన్ పరిధిలోని కాలనీలలో డ్రైనేజీ సిసి రోడ్ల నిర్మాణానికి అధిక ప్రాధాన్యత ఇచ్చినట్లు కార్పొరేటర్ శ్రవణ్ తెలిపారు.మల్కాజిగిరి డివిజన్ బలరాం నగర్ కాలనీలో పలువురు జిహెచ్ఎంసి అధికారులు స్థానికులతో కలిసి దాదాపు 83 లక్షల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలకు బుధవారం శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ
బలరాం నగర్ కాలనీలో ఉన్నటువంటి అంతర్గత సిసి రోడ్లకు దాదాపు 48 లక్షల రూపాయలు , డాక్టర్ రమేష్ రెడ్డి చిల్డ్రన్స్ హాస్పిటల్ వద్ద మెయిన్ రోడ్డుకు 35 లక్షల రూపాయలతో పనులు చేపట్టనున్నామని తెలిపారు.
బలరాం నగర్ లో అనేక కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేశామన్నారు. పలు సిసి రోడ్లు, భూగర్భ డ్రైనేజీలు నాలా సంబంధిత పనులు చేపట్టినందుకు స్థానికులు శ్రవణ్ కు ధన్యవాదాలు తెలియజేశారు.
త్వరలో మరిన్ని కోట్ల రూపాయలతో మురునీటి నివారణకు పనులు చేపట్టనున్నారు.
ఈ కార్యక్రమంలో ఏ. ఈ నవీన్,రమేష్,సూరజ్ సింగ్,రామ్ లకన్, శ్రీనివాస్ రెడ్డి, గోపాల్ సింగ్,కిషోర్ సింగ్, వెంకట్రావు, సతీష్ కుమార్, పెద్ద ఎత్తున కాలనీవాసులు పాల్గొన్నారు.