ముద్ర ప్రతినిధి, నిర్మల్:
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక” లో భాగంగా, నిర్మల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యా వారోత్సవాలను ప్రారంభించారు.స్థానిక కౌన్సిలర్ బి. సుమలత ముఖ్య అతిథిగా వారోత్సవాల గోడ పత్రిక, బ్యానర్‌ను ఆవిష్కరించారు. కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ ఎం. సుధాకర్ మాట్లాడుతూ ప్రభుత్వం విద్యారంగ బలోపేతానికి పెద్దపీట వేస్తోందని, అందులో భాగంగా నిర్వహిస్తున్న ఈ ఏడు రోజుల కార్యక్రమాలను విద్యార్థులు, అధ్యాపకులు సమన్వయంతో విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ యు. గంగాధర్, ఏఓ నాగ శ్రీనివాస్, వివిధ విభాగాల అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.