Take a fresh look at your lifestyle.

కల్వకుర్తి నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు – ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి

 

ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్:

కల్వకుర్తి నియోజకవర్గంలో పలు అభివృద్ధి మరియు సేవా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి (CMRF–LOC) పత్రాలను అందజేశారు.

తదుపరి, పడకల్ గేట్ సమీపంలోని ప్రైవేట్ ఫంక్షన్ హాల్‌లో లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో శ్రీ పి. అంజిరెడ్డి తన 150వ రక్తదానాన్ని పూర్తి చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే గారు, అంజిరెడ్డి గారి సేవలను అభినందించి, వారి కుటుంబ సభ్యులను శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో తలకొండపల్లి, కడ్తాల్ మండలాలకు చెందిన ముఖ్య నాయకులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.


అనంతరం, చంద్రధన్ సబ్ స్టేషన్‌లో సుమారు రూ.2.50 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన ఫీడర్లను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ ఫీడర్ల ద్వారా రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా అందించి వ్యవసాయ పనులు సులభతరం కానున్నాయి.
ఇక ఆమనగల్ మండలంలో కూడా అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగించబడ్డాయి. ఆకుతోటపల్లి గ్రామ పంచాయతీలో సబ్ స్టేషన్‌లో రూ.2.50 కోట్ల వ్యయంతో ఫీడర్ ప్రారంభించగా, ఆమనగల్ పట్టణంలోని సబ్ స్టేషన్‌లో మేడిగడ్డ 11KV ఫీడర్‌ను కూడా ప్రారంభించారు.
ఈ కార్యక్రమాల్లో బాలాజీ సింగ్, ఆమనగల్ మార్కెట్ చైర్మన్ యాట గీత, వైస్ చైర్మన్ భాస్కర్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, జగ్గా రెడ్డి, కేశవ రెడ్డి, మెహన్ రెడ్డి, రమాదేవి, శ్రీనివాస్ రెడ్డి, నర్సింహ, రఘురాములు, రమేష్ యాదవ్, శ్రీశైలం, మహేష్, రఘుపతి, రాజెందర్ రెడ్డి, రాజెందర్ నాయక్, రవీంద్ర యాదవ్, అజీమ్, నర్సింహ రెడ్డి, మల్లేష్ యాదవ్, కృష్ణ, చెన్నకేశవులు, రఘుపతి యాదవ్ తదితర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.