Take a fresh look at your lifestyle.

శాంతిభద్రతలకు పరిరక్షణకు ప్రజలు సహకరించాలి కుషాయిగూడ సిఐ భాస్కర్ రెడ్డి

 

ముద్ర :కాప్రా

కాప్రా గాంధీనగర్ పరిసర ప్రాంతంలో శాంతి భద్రతలను మరింత పటిష్టం చేయడంతో పాటు వాహనదారుల భద్రతను నిర్ధారించేందుకు కుషాయిగూడ ఎస్ హెచ్ ఓ భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో విస్తృత స్థాయిలో వాహనాల తనిఖీలు ఫుట్ పేట్రోలింగ్ కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఎస్ఐ లు,వెంకన్న ,శ్రీనివాస్ గోపాల్ రెడ్డి , అశోక్ , గోపాల్ , అలాగే క్రైమ్ టీం సభ్యులు పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.
తనిఖీల సందర్భంగా వాహనదారులకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించడంతో పాటు హెల్మెట్, లైసెన్స్, వాహన పత్రాల ప్రాముఖ్యతను వివరించారు. ఈ చర్యల వల్ల ప్రాంతంలో నేరాల నియంత్రణకు తోడ్పడటమే కాకుండా ప్రజల్లో భద్రతాభావం మరింత పెరిగిందని స్థానికులు అభిప్రాయపడ్డారు.
పోలీసుల ఈ ముందస్తు చర్యలు ప్రజల భద్రతకు మేలు చేస్తాయని, శాంతియుత వాతావరణం కొనసాగేందుకు దోహదపడతాయని అధికారులు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.