Take a fresh look at your lifestyle.

చిన్నతనం నుంచే పిల్లలకు మంచి విలువలు అందించాలి.

– పిల్లలకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్ పై అవగాహన కల్పించాలి
– స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డా.పి.శ్రీజ
ముద్ర ప్రతినిధి, ఖమ్మం
పిల్లలకు చిన్నతనం నుంచే మంచి విలువలు అందించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డాక్టర్ పి శ్రీజ అన్నారు.
బుధవారం స్థానిక కలెక్టర్ సమావేశ మందిరంలో జిల్లా మహిళా సాధికారిక కేంద్రం, మహిళా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన “జాతీయ బాలికల దినోత్సవం” వేడుకకు హాజరైన శ్రీజ మాట్లాడుతూ ఖమ్మం జిల్లా “చిన్నారి” అనే ప్రత్యేక కార్యక్రమం రూపొందించి మహిళా, సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో దాదాపు 1000 విద్యాసంస్థల్లో పర్యటించి పిల్లలకు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ పై అవగాహన కల్పించామన్నారు. గుడ్ టచ్, బెడ్ టచ్ పై ప్రతి ఇంట్లో పిల్లలకు అవగాహన కనిపించాలని పిల్లలు అన్ని విషయాలు మనతో పంచుకునేలా వారికి స్వేచ్ఛ కల్పించాలన్నారు ఇంట్లో ఉన్న ఆడ, మగ పిల్లలు సమానంగా ఇతరులను ఎలా గౌరవించాలో నేర్పించాలని, చిన్నతనం నుండి సెల్ ఫోనులు పిల్లలకు అలవాటు చేయవద్దని సూచించారు. పిల్లలకు ప్రతి దశలోనూ తల్లిదండ్రులు భాగస్వామ్యం కావాలని, చిన్నతనంలోనే పిల్లలను క్రమశిక్షణలో పెట్టాలన్నారు. పిల్లలు మంచి చదువుతోపాటు సంస్కారం కూడా అందించే బాధ్యత మనపైనే ఉందన్నారు. పిల్లలు చిన్నతనం నుండి ఇతరులను గౌరవిస్తూ సమాన భావంతో ఎలా జీవించాలో నేర్పించాలన్నారు. పిల్లలు మన ప్రవర్తన నుంచి చాలా నేర్చుకుంటారని ఇంట్లో మనం సమానత్వం పాటిస్తే అది చూసి పిల్లలు కూడా అలాగే జీవిస్తారని, ఇంట్లో ఉన్న పిల్లల మధ్య ఎలాంటి భేదభావం చూపించకుండా పెంచాలని సూచించారు.అనంతరం గుడ్ టచ్, బ్యాడ్ టచ్ పై చర్చించి అభిప్రాయాలు తెలుసుకున్నారు ఈ సందర్భంగా అర్బన్ రూరల్ ప్రాజెక్ట్ అంగన్వాడి పిల్లల బెల్ బేబీ షో ప్రదర్శన ఆకట్టుకుంది .

Leave A Reply

Your email address will not be published.