ముద్ర ప్రతినిధి, జగిత్యాల: జగిత్యాల పట్టణంలోని పార్టీ కార్యాలయం జమ్ము కశ్మీర్ పహల్గామ్ ఉగ్రవాదుల దాడిలో మరణించిన వారికి ఆత్మశాంతి కలగాలని ప్రార్థిస్తూ జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ అధ్వర్యంలో జగిత్యాల నియోజకవర్గ ముఖ్య నాయకులు, కార్యకర్తలు కొవ్వొత్తులు వెలిగించి మౌనం పాటించి నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ మాట్లాడుతూ పహల్గాన్ సంఘటన చాలా దురదృష్టకరమన్నారు. 100 పైగా దేశాలు ఉగ్రదాడిని ఖండించి భారత్ కు అండగా నిలిచాయని, ఉగ్ర వాదులు మతం పేరుతో చంపడం అనేది కొన్ని మతతత్వ శక్తులు రెచ్చగొట్టే అవకాశం ఉందని,మత విద్వేషాలు రెచ్చగొట్టడం ప్రధాన కారణంగా కనిపిస్తుంది అన్నారు. ఇలాంటి సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని,అమాయకులు బలి కాకుండా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉంది. పేదరికం పై అందరం కోట్లడాలి అని కుల మతాల చిచ్చులు పెట్టీ కాదని అన్నారు.కశ్మీర్ లో పర్యాటకం దెబ్బతీయటం, మత విద్వేషాలు రెచ్చగొట్టడం వల్ల భారత దేశంలో సెక్యులర్ దేశంలో ఎలాంటి ప్రభావం ఉండదని అన్నారు. ఉగ్రవాదులను కేంద్ర ప్రభుత్వం తక్షణమే పట్టుకొని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.