- బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పట్నంలో శాంతి ర్యాలీ.
ఇబ్రహీంపట్నం, ముద్ర విలేకరి: కాశ్మీర్లోని పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడి పిరికి పంద చర్య అని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, మాజీ కార్పొరేటర్ మంచిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఖండించారు. గురువారం రాత్రి ఇబ్రహీంపట్నం పట్టణ కేంద్రంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో శాంతి ర్యాలీ నిర్వహించారు.సాగర్ ప్రధాన రహదారి గుండా జాతీయ జెండాలను పట్టుకొని, అంబేద్కర్ చౌరస్తా వరకు ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ దుస్సంఘటనలో మృతుల కుటుంబాలకు ఆత్మకు శాంతి కలగాలని ప్రార్ధిస్తున్నట్లు చెప్పారు. దేశంలో మత చిచ్చు పెట్టాలని చూస్తే దేశ ప్రజలంతా తిరగబడతారని హెచ్చరించారు.ఈ ర్యాలీలో మాజీ ఎంపీపీ కృపేశ్, బీఆర్ఎస్ యువజన విభాగం నియోజకవర్గ అధ్యక్షులు జేర్కొని రాజు, విద్యార్థి సంఘం అధ్యక్షులు నట్టు జగదీశ్వర్, నాయకులు రాజ్ కుమార్, బద్రీనాథ్ గుప్తా, కొండ్రు ప్రవీణ్, శివ సాయి, భారత్ కుమార్, భారత్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.