మహాదేవపూర్, ముద్ర:
అజాత శత్రువు శ్రీపాద రావు 27 వర్ధంతి సందర్భంగా గ్రామంలో స్వర్గీయ దుద్దిల్ల శ్రీపాదరావు విగ్రహానికి పూలమాల వేసి గ్రామ సర్పంచ్ హసీనా భాను అక్బర్ ఖాన్ గ్రంథాలయ చైర్మన్ కోట రాజబాబు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కటకం అశోక్, విలాస్ రావు, చల్లా తిరుపతిరెడ్డి, ఆకుతోట సుధాకర్, రాణిబాయి, వామన్ రావు, వరప్రసాద్, అస్రార్ ఖురేషి, నైయుముద్దీన్, చక్రధర్, రాఘవేంద్ర, జగదీష్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు. మండల పరిషత్ కార్యాలయం మరియు మాదిగ కార్యాలయంలో శ్రీపాద విగ్రహాలకు అధికారులు రాజకీయ నాయకులు ఘన నివాళి అర్పించారు. లడ్డు వడ్ల సమ్మయ్య సమ్మయ్య ముదిరాజ్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కాళేశ్వరంలో మరియు అన్నారం గ్రామంలో పలువురు ప్రజా ప్రతినిధులు నాయకులు వర్ధంతి సందర్భంగా పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.