మొయినాబాద్, ముద్ర విలేకరి: జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి నీ బీ అర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే టీ ఆర్ ప్రమార్శించారు.రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని హిమాయత్ నగర్ గ్రామ రెవెన్యూలోని తన నివాసంలో ఉన్న రాజేశ్వర్ రెడ్డి ని శుక్రవారం పరమార్శించడంతో పాటు రాజేశ్వర్ రెడ్డి పుట్టిన రోజు ఉండటంతో శుభాకాంక్షలు చెప్పారు. కాలు విరిగి ఇంట్లో మెడికేషన్ లో ఉన్న రాజేశ్వర్ రెడ్డి తొందరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు.ఆయనతో పాటు బీ అర్ ఎస్ రాష్ట్ర నాయకులు కొంపల్లి అనంత రెడ్డి,బీ అర్ ఎస్ మండల అధ్యక్షుడు దారెడ్డి వెంకట్ రెడ్డి,మాజీ సర్పంచ్ శ్రీహరి యాదవ్,బీ అర్ ఎస్ మండల పార్టీ మాజీ ఉపాధ్యక్షులు జయవంత్,మాజీ ప్రధాన కార్యదర్శి నరసింహ గౌడ్, తదితరులు పాల్గొన్నారు