యైటింక్లయిన్ కాలనీ, ముద్ర: సింగరేణి చీఫ్ మెడికల్ ఆఫీసర్ (సిఎంఒ) డాక్టర్: కిరణ్ రాజ్ కుమార్ శుక్రవారం రామగుండం రెండవ ఏరియాలో సందర్శించారు. ఉదయం ఏరియాకు వచ్చిన ఆయన ముందుగా ఏరియా జీఎం ఛాంబర్ లో జనరల్ మేనేజర్ బి. వెంకటయ్య తో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఏరియాలోని ఉద్యోగులు వారి కుటుంబ సభ్యులకు అందిస్తున్న వైద్య పరమైన అంశాలపై ఆయన ఏరియా జీఎం వెంకటయ్య తో చర్చించారు. అలాగే ఏరియా పరిధిలో సెక్టార్.3 డిస్పెన్సరీ లో ఉద్యోగులకు వారి కుటుంబ సభ్యులకు అందిస్తున్న వైద్య సేవలు, డిస్పెన్సరీలో సమకూర్చిన సదుపాయాలు, వైద్య సిబ్బంది, తదితర అంశాలపై కూడా ఆయన చర్చించారు. ఇక సీఎంఓ గా పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత, మొదటి సారిగా ఏరియాకి విచ్చేసిన డాక్టర్ కిరణ్ రాజ్ కుమార్ ను ఏరియా అధికారులు శుభాకాంక్షలు తెలిపారు. ఇంకా ఈ సమావేశంలో ఏరియా అఫిషియేటింగ్ ఎస్ఓ టు జిఎం సంతోష్ కుమార్, డీజీఎం (ఐఇ) మురళీకృష్ణ, సెక్టార్.3 డిస్పెన్సరీ మెడికల్ సూపరిండెంట్ డాక్టర్ మహిపాల్, డీజీఎం (ఫైనాన్స్) వెంకట రామచంద్ర తదితరులు పాల్గొన్నారు.