ముద్ర ప్రతినిధి, జగిత్యాల: భూ తగాదా విషయంలో అన్నను గాయపరిచిన తమ్ముడికి మూడు సంవత్సరాల జైలు శిక్ష, రూ. 10 వేల జరిమాన విధిస్తూ మెట్ పల్లి జే ఎఫ్ సి యం న్యాయమూర్తి అరుణ్ కుమార్ తీర్పు నిచ్చారు.మెట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఆత్మకూరు గ్రామానికి చెందిన మల్లయ్య కు ఐదుగురు కుమారులు ఉన్నారు. ఆత్మకూరు గ్రామ శివారులో మల్లయ్య కు ఒక ఎకరం భూమి ఉండగా ఆ భూమిని 5 గురు కొడుకులు సమానంగా పంచుకునే క్రమంలో చిన్న కొడుకు బీరయ్య వినకుండా గొడవలు సృష్టించేవాడు. ఈ క్రమంలో బీరయ్యకు సంబంధించిన 8 గుంటల భూమిని వదిలేసి మిగతా భూమిని ఆ నలుగురు కుమారులు ఒక్కొక్కరు ఒక్కొక్క సంవత్సరం వ్యవసాయం చేసుకుంటున్నారు. 2019 ఆగస్ట్ 31న బీరయ్య తన ట్రాక్టర్ తో మిగతావారు చేసుకుంటున్న పంటను ద్వంసం చేసే యత్నించగా అడ్డుగా వెళ్లిన తన అన్న ముత్తయ్యను పారతో కొట్టి గాయపరిచాడు. విషయంఫై అతని రెండవ తమ్ముడు నడిపి మల్లయ్య పోలీసులకు ఫిర్యాదు చేయగా అప్పటి ఎస్సై కిరణ్ కుమార్ నిందితుడు అయిన బీరయ్య పై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ప్రణయ్ కుమార్ తమ వాదనలు వినిపించగా సాక్షులను విచారించిన న్యాయమూర్తి అరుణ్ కుమార్ నిందితుడు బీరయ్యకి మూడు సంవత్సరాల జైలు శిక్షతో పాటు రూ. 10 వేల జరిమాన విధిస్తూ తీర్పునిచ్చారు. ఈ కేస్ లో పకడ్బందీగా విచారణ జరిపి సాక్ష్యాదారాలను, సాక్ష్యులను కొర్టులో ప్రవేశ పెట్టి, శిక్ష పడటానికి కృషిచేసిన అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ప్రణయ్ కుమార్, నేరపరిశోధన అధికారులు ఎస్.ఐ కిరణ్ కుమార్, కోర్టు లైజనింగ్ ఆఫీసర్స్ ఎస్.ఐ జి.శ్రీకాంత్,కిరణ్ కుమార్, కోర్టు డ్యూటీ ఆఫీసర్స్ సునీల్ లను జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ అభినందించారు.