Take a fresh look at your lifestyle.

పౌష్టికాహారం అందజేయడమే ప్రభుత్వ లక్ష్యం: జిసిడిఓ శోభారాణి

ముద్ర ప్రతినిధి కల్వకుర్తి: బాలికలు సంపూర్ణ ఆరోగ్యాలతో ఉండాలని ఉద్దేశంతో కేజీబీవీ లో ఈ విద్యా సంవత్సరం నుండి మెనూ మార్చడం జరిగిందని పౌష్టికాహారం అందించడమే లక్ష్యంగా కొత్త మెనూ అమల్లోకి వచ్చిందని జిసిడిఓ శోభారాణి అన్నారు. నూతన మెనుపై జిల్లాలోని అన్ని పాఠశాలల వంటలు చేసే వారికి మంగళవారం కల్వకుర్తి పట్టణంలో శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె పాల్గొని మాట్లాడారు.నాగర్ కర్నూల్ జిల్లా లోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాల్లో చదువుతున్న విద్యార్థినుల శారీరక, మానసిక ఆరోగ్యాన్ని బలోపేతం చేయాలనే దృక్పథంతో రాష్ట్ర ప్రభుత్వం కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలు (కేజీబీవీ) తిరిగి ప్రారంభమవుతున్న తరుణంలో, విద్యార్థినులకు పౌష్టికాహారం అందించేందుకు ప్రభుత్వం ఫుడ్ మెనూను మారుస్తూ నిర్ణయం తీసుకుందని ఆమె అన్నారు. ఈ నెల 12వ తేదీ నుంచి కొత్త మెనూ అమలులోకి రానుందని,కేజీబీవీ బాలికలు ఈ విద్యా సంవత్సరంలో సరికొత్త వంటకాలను రుచి చూడనున్నట్లు తెలిపారు.గురుకుల విద్యాలయాల తరహాలో కేజీబీవీల్లోనూ మెనూ ఉండాలని ప్రభుత్వం సంకల్పించడంతో ఆ మేరకు జిల్లాలోని 20 కేజీబీవీల్లో చర్యలు తీసుకున్నామన్నారు.కొత్త ఆహార పట్టికలో కీలక మార్పులతో దాని ప్రకారం నెలకు రెండుసార్లు మాంసాహారం వడ్డిస్తారని, వారంలో ఐదుసార్లు గుడ్లు, ప్రతిరోజు ఆహారంలో నెయ్యి ఉంటుందన్నారు.ఈ మార్పులు బాలికల ఆరోగ్యానికి, పోషక అవసరాలకు అనుగుణంగా రూపొందించబడ్డాయని తెలిపారు.
కొత్త వంటకాల తయారీపై వంట సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇస్తున్నామని తెలిపారు.ఒక్కో విద్యార్థినికి గతంలో నెలకు రూ.1225 ఉన్న మెస్ ఛార్జీలను ప్రభుత్వం తాజాగా రూ.1740కి పెంచింది. దీనివల్ల ఒక్కో విద్యార్థినికి అదనంగా రూ.515 ఖర్చు చేయనున్నరని,ఈ పెంపు నాణ్యమైన పౌష్టికాహారం అందించడానికి దోహదపడుతుందని తెలిపారు.కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా ఉన్న కేజీబీవీల ప్రత్యేక అధికారులు , వంట చేసే మహిళలు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.