మాదాపూర్, ముద్ర విలేఖరి: వివేకానంద నగర్ డివిజన్ పరిధిలోని కమల ప్రసన్న నగర్ కాలనీ వాసులు పలు సమస్యలు మరియు చేపట్టవలసిన పలు అభివృద్ధి పనుల పై పీయేసీ చైర్మన్ ఆరెకపూడి గాంధీ ని తన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం సమర్పించడం జరిగినది.దీనిపై చైర్మన్ శ్రీ ఆరెకపూడి గాంధీ సానుకూలంగా స్పందించడం జరిగినది.ఈ సందర్భంగా కమల ప్రసన్న నగర్ కాలనీ వాసులు మాట్లాడుతూ కమల ప్రసన్న నగర్ కాలనీ లో మౌలిక వసతులు కలిపించినదుకు కృతజ్ఞతలు తెలియచేస్తున్నాం అని అదేవిధంగా కమల ప్రసన్న నగర్ కాలనీ లో అంపూర్తిగా మిగిలిపోయిన 2 సీసీ రోడ్ల ను వేయాలని మరియు అసంపూర్తిగా మిగిలిపోయిన యూజీడ్ పనులు చేపట్టాలని, మంచి నీటి వ్యవస్థ ను మెరుగుపర్చలని, విధి దీపాలను వ్యవస్థను ఏర్పాటు చేయాలని చైర్మన్ గాంధీ కి వినతి పత్రం ద్వారా కోరడం జరిగినది.
ఈ సందర్భంగా చైర్మన్ గాంధీ మాట్లాడుతూ త్వరలోనే కాలనీ లో పర్యటిస్తానని,కమల ప్రసన్న నగర్ కాలనీ లో నెలకొన్న అసంపూర్తిగా మిగిలిపోయిన రోడ్ల సమస్యను త్వరితగతిన పరిష్కరిస్తామని. కాలనీ లో అన్ని రకాల మౌలిక వసతులు కలిపించామని,అసంపూర్తిగా మిగిలిపోయిన రోడ్లను, పనులు అతి త్వరలో చేపట్టి ప్రజలకు అందుబాటులో కి తీసుకువస్తామని, ప్రజలకు ఇబ్బంది లేకుండా సుఖవంతమైన ప్రయాణానికి బాటలు వేస్తామని అన్ని రోడ్ల ను దశల వారిగా చెప్పటి పూర్తి స్థాయిలో రోడ్ల నిర్మాణం పనులు చేపట్టి ప్రజలకు అందుబాటులో కి తీసుకువస్తామని, డ్రైనేజి వ్యవస్థను, మంచి నీటి వ్యవస్థను మెరుగుపరుస్తామని గాంధీ తెలియచేసారు.అసంపూర్తిగా మిగిలిపోయిన, రోడ్ల పనులు వెంటనే చేపట్టి ప్రజలకు ఉపశమనం కలిగేలా చూడలని అధికారులకు తెలియచేసారు.అదేవిధంగా ఏ చిన్న సమస్య వచ్చిన తన దృష్టికి తీసుకువస్తే తప్పకుండా పరిష్కరిస్తానని, ఎల్లవేళలో మీకు అందుబాటులో ఉంటానని, మీకు అన్ని విధాలుగా అండగా ఉంటానని చైర్మన్ గాంధీ తెలియచేసారు.ఈ కార్యక్రమంలో నాయకులు సంజీవ రెడ్డి కమల ప్రసన్న నగర్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్, వైస్ ప్రెసిడెంట్ తిరుపతి, జాయింట్ సెక్రెటరీ బండప్ప, రాఘవులు, ఆర్గనైజర్ వెంకటేష్, సుబ్బారావు మరియు కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.