అచ్చంపేట, ముద్ర: నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట పట్టణం లో అతి పురాతనమైన దేవాలయం శ్రీ భ్రమరాంబిక ఆలయం లో శ్రీరామ నవమి సందర్భంగా సీతారామ చంద్రుల కల్యాణోత్సవం అంగరంగ వైభవంగా కనుల పండుగగా జరిగింది. ఇట్టి కార్యక్రమంలో ఆలయ అధ్యక్షులు పోకల శ్రీధర్, లక్ష్మి, స్వామివారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు, ఆభరణాలు, సమర్పించారు.తదుపరి ఎదురుకొల్లు కార్యక్రమం భాజా భజంత్రీతో అచ్చంపేట పట్టణ పురవీధుల గుండాఊరేగింపు తదుపరి సీతారామ చంద్రుల కల్యాణోత్సవాన్ని వేద పండితుల మంత్రోచ్ఛారణతో అంగరంగ వైభవంగా నిర్వహించారు.ఇట్టి కార్యక్రమానికి సామాజిక కార్యకర్త సాదే రాజు సొంత ఖర్చుతో సుమారు 2000 మందికి అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. భక్తులు సీతారామచంద్రస్వామి కళ్యాణ మహోత్సవాన్ని తిలకించి తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామివారి తలంబ్రాల బియ్యం ముత్యాలు వేద పండితులు ఉదయ్ శర్మచే భక్తిశ్రద్ధలతో తీసుకున్నారు.ఈ కార్యక్రమంలో కేతేపల్లి వెంకటేష్, మాధవరావు, శివ, మాచిరెడ్డి, పవన్, గణేష్, వంశీ, బాబు సాగర్, రాము, రమేష్, సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు
