Take a fresh look at your lifestyle.

నలుగురు దోపిడీ ముఠా అరెస్ట్- మల్కాజిగిరి డిసిపి సురేష్

 

ముద్ర, మల్కాజిగిరి

మెడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని చెంగిచెర్ల ప్రాంతంలో వరుసగా జరిగిన అర్ధరాత్రి ఇళ్లలో చోరీ కేసులను మల్కాజ్‌గిరి కమిషనరేట్‌కు చెందిన మెడిపల్లి పోలీసులు సిసిఎస్ ఉప్పల్ ప్రత్యేక బృందాలు విజయవంతంగా ఛేదించాయి. ఈ ఘటనల్లో పాల్పడ్డ ముగ్గురు ప్రధాన నిందితులు, ఒక రిసీవర్‌ను అరెస్ట్ చేసినట్టు మల్కాజిగిరి డిసిపి సురేష్, సైబర్ క్రైమ్ డిసిపి వెంకటలక్ష్మి తెలిపారు. మేడిపల్లిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ నిందితులు ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ బీహార్ రాష్ట్రాలకు చెందినవారని,
తాళం వేసి ఉన్న ఇళ్లను టార్గెట్‌గా చేసుకుని రాత్రివేళ అక్రమంగా ప్రవేశించి నగదు, బంగారు ఆభరణాలు తదితర విలువైన వస్తువులు చోరీ చేసేవారని తెలిపారు. ఈ మేరకు మెడిపల్లి పోలీస్ స్టేషన్‌లో పలు కేసులు నమోదు అయ్యాయి.
ఈ వరుస ఘటనలను సీరియస్‌గా తీసుకున్న పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి, సీసీటీవీ ఫుటేజ్, సాంకేతిక ఆధారాలు, స్థానిక సమాచారం ఆధారంగా విచారణ చేపట్టారు. దర్యాప్తులో భాగంగా నిందితులను బీహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో గుర్తించి ట్రాన్సిట్ వారెంట్‌పై హైదరాబాద్‌కు తరలించారు.
మహాదేవ్ ఝా – ఢిల్లీ,పవన్ గుప్తా @ పవన్ కుమార్ – ఢిల్లీ,
మంగళ్ సింగ్ – కాన్పూర్, ఉత్తరప్రదేశ్,
సీరమ్ సావ్ బీరేంద్ర – కైండి వార్డు, బీహార్ (రిసీవర్) లను అరెస్టు చేశారు.
ప్రధాన నిందితులు గతంలో కూడా ఢిల్లీ, వరంగల్, నల్గొండ, జనగాం ప్రాంతాల్లో
ఇళ్ల దొంగతనాలు, ఆయుధాల చట్టం, హత్య కేసుల్లో నిందితులుగా ఉండగా, పలు కేసుల్లో శిక్ష అనుభవించినట్లు పోలీసులు తెలిపారు.
స్వాధీనం చేసుకున్న వస్తువులు:
నాలుగు మొబైల్ ఫోన్లు
నగదు రూ. 2,04,000/-
కేసు వివరాలు:
15/16 జనవరి 2026 అర్ధరాత్రి చెంగిచెర్లలోని కనకదుర్గ కాలనీలో మొత్తం 9 ఇళ్లలోకి చొరబడి బంగారు, వెండి ఆభరణాలు మరియు నగదు చోరీ చేసి నిందితులు పరారైనట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనలపై నాలుగు కేసులు నమోదు చేసి దర్యాప్తు కొనసాగించగా, చివరకు నిందితులను అరెస్ట్ చేయడంలో విజయం సాధించారు.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద వ్యక్తులపై వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని అధికారులు సూచించారు.

Leave A Reply

Your email address will not be published.