Take a fresh look at your lifestyle.

దుర్గాదేవికి ఆషాడ బోనాలు సమర్పించిన లేడీస్ క్లబ్

ముద్ర ప్రతినిధి, గోదావరిఖని: సింగరేణి అధికారుల నివాసం బంగ్లస్ ఏరియాలోనెలకొన్న దుర్గదేవి అమ్మవారి ఆలయం లో గురువారం ఆషాద శుద్ధ పౌర్ణమి పురస్కరించుకొని శాఖంబరి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు.దుర్గదేవి అమ్మవారి ఆలయం లో ఆషాద శుద్ధ పౌర్ణమిని సందర్భముగా వివిధ కూరగాయలు,పండ్లు ఆకుకూరలతో అమ్మవారిని ఆలయాన్ని అలంకరించి శాఖంబరి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు.ఇట్టి ఉత్సవాలలో ముఖ్య అతిధిగా శ్రీమతి అనిత లలిత్ కుమార్ ఆర్జీ-1 సేవా సమితి అధ్యక్షురాలు ఆధ్వర్యం లో ఆలయ కమిటి సభ్యులు లేడిస్ క్లబ్ సభ్యులు బోనాలు ఎత్తుకొని ప్రదర్శనగా అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ ఆవరణలో లలిత సహస్ర నామములు పారాయణం చేశారు.ఈ సందర్భంగా మేడం మాట్లడుతూ ప్రతి ఏడాది ఆషాడ మాసంలో అమ్మవారిని శాకంబరీగా అలంకరించి పూజించడం వలన ప్రకృతి వైపరిత్యాలు తొలగిపోయి వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని శాకం అంటే కూరగాయలతో దేవి ఉత్సవాలు నిర్వహించడం అని ఇది ప్రతి సంవత్సరం ఆనవాయితీగా వస్తున్నదని దేశం సస్యశ్యామలంగా ఉండి పాడి పంటలతో అభివృద్ధి చెందెందుకు శాఖంబరి దేవి ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. అనంతరం ఆలయ ఆవరణలో అధికారుల సతీమణులు కోలాటాలు, భజనలునిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదములు అన్నధానం చేశారు.ఈ కార్యక్రమంలో డైరెక్టర్ ఆపరేషన్ ఎల్.వి సూర్యనారాయణ, అర్జీ1.జనరల్ మేనేజర్ డి.లలిత్ కుమార్, అర్జీ.2 జిఎం బండి వెంకటయ్య, ఆలయ కమిటీ సభ్యులు సుధా, స్వరూప, నీరజ, చిలుక లక్ష్మి లేడిస్ క్లబ్ సభ్యులు తదితరులు పాల్గోన్నారు.

Leave A Reply

Your email address will not be published.