- ఎమ్మార్పీఎస్ వనపర్తి జిల్లా ప్రధాన కార్యదర్శి మీసాల నాగరాజు
ముద్ర,వీపనగండ్ల :ఎస్సీ వర్గీకరణ సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసి అమరులైన మాదిగ అమరవీరుల కుటుంబాలకు ప్రభుత్వం 25 లక్షల రూపాయలు పరిహారం ఇవ్వాలని ఎమ్మార్పీఎస్ వనపర్తి జిల్లా ప్రధాన కార్యదర్శి మీసాల నాగరాజు మాదిగ డిమాండ్ చేశారు.మార్చి 1న నిర్వహించే మాదిగ అమరవీరుల దినోత్సవాని జయప్రదం చేయాలని కోరుతూ మండల కేంద్రమైన వీపనగండ్ల లో ఎమ్మార్పీఎస్ కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు.మీసాల నాగరాజు మాట్లాడుతూ ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ,రిజర్వేషన్లు అన్ని కులాలకు కేటాయింపుల్లో శాస్త్రీయంగా జరగాలని,మంత్రివర్గ విస్తరణలో మాదిగలకు రెండు పదవులు ఇవ్వాలి అనే డిమాండ్ చేశారు.మాదిగ ఉప కులాల విద్యార్దిని విద్యార్థుల భవిష్యత్ కోసం పోరాటం చేసి అమరులైన వారిని స్మరించుకోవడం బాధ్యతగా భావించాలని అన్నారు. కార్యక్రమంలో ఎమ్మెస్ ఎఫ్ జిల్లా అధ్యక్షుడు మొలకలపల్లి పరుశరాముడు మాదిగ,ఎమ్మార్పీఎస్ మండల కార్యదర్శి బండారు విష్ణు మాదిగ,నాయకులు నలవల్ల ప్రవీణ్ మాదిగ,తపేట నంది మాదిగ,మీసాల వినోద్ మాదిగ తదితరులు పాల్గొన్నారు.